యంగ్ హీరో నితిన్ కి రష్మిక మందన్న తప్ప మిగతా ఏ హీరోయిన్‌తో వర్కౌట్ కావడం లేదు. కీర్తి సురేశ్ తో చేసిన రంగ్ దే ఓ మాదిరిగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ ప్రకాశ్ వారియర్ తో నటించిన చెక్ అంతే సంగతులు. కృతి శెట్టి తో హిట్ కొట్టాలనుకుంటే అది కాస్తా బెడిసికొట్టింది. ఉప్పెన తర్వాత కృతిశెట్టి అందరికీ ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది.
కానీ, ఉప్పెన మాత్రమే కృతి ఖాతాలో భారీ హిట్. ఆ తర్వాత నటించిన వాటిలో బంగార్రాజు సినిమా హిట్ అందుకుంది. రాం పోతినేనితో చేసిన సినిమా, నితిన్ సినిమా వరుసగా ఫ్లాపయ్యాయి. ఇప్పుడు కృతి శెట్టి కంటే ఎక్కువ అవకాశాలు అందుకుంటుంది శ్రీలీల. చెప్పాలంటే శ్రీలీల ఖాతాలో ధమాకా మాత్రమే మాస్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా తర్వాత నటించిన స్కంద డిజాస్టర్. ఇటీవల మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో నటించిన ఆదికేశవ అడ్రస్ లేకుండా పోయింది. ఈ మధ్యలో చేసిన భగవంత్ కేసరి సినిమా హిట్ అయినా అది బాలయ్య ఖాతాలోకి వెళ్ళింది. శ్రీలీలకి దక్కిన సక్సెస్ శాతం చాలా తక్కువ. ఇప్పుడు శ్రీలీల ఆశలన్ని నితిన్ సరసన నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్ సినిమా మీదే.
ఈ సినిమా గనక ఫ్లాప్ అయితే, నితిన్ కి ఏమో గానీ, శ్రీలీల గురించి మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తారు. నితిన్ ధమాకా సక్సెస్ చూసి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. కానీ, ఆ తర్వాత వచ్చిన ఫ్లాపులు ఇప్పుడు నితిన్ ని కూడా ఆలోచింపజేస్తున్నాయట. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఉన్న సినిమాలు గుంటూరు కారం, ఉస్తాద్ భగత్‌సింగ్. మరికొన్ని సైన్ చేసింది. వాటిలో మళ్ళీ నితిన్ సినిమా కూడా ఉంది. కానీ, త్వరలో ఎక్స్ట్రా పోతే శ్రీలీల వల్ల నితిన్ కి దెబ్బ పడిందనడంలో డౌటే లేదు.