కథ, సన్నివేశాల పరంగా చిత్రాల్లో హీరోలదే కీలక పాత్ర. అయితే.. ఒక్కొక్కసారి హీరోల కంటే కూడా.. విలన్లకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఇలా.. చాలా సినిమాలు కూడా వచ్చాయి. అంత మాత్రాన హీరో హీరోకాకుండా పోడు.. విలన్ ఎప్పటికీ హీరోగానూ మిగల్లేడు. కానీ.. ఇలాంటి వివాదాలైతే చాలానే ఇండస్ట్రీలో ఉన్నాయి. హీరోలను మించిన రెమ్యునరేషన్ తీసుకున్న విలన్లు.. సౌకర్యాలు పొందిన విలనీలు చాలా మంది ఉన్నారు.
ఇక, పాతతరానికి వెళ్లినా.. అప్పట్లోనూ ఇదే తరహా వివాదాలు తెరచాటున చాలానే జరిగేవి. అయితే, ఇలాంటి వివాదాలు ఆ సినిమాలకు ప్లస్సయ్యాయే కానీ, మైనస్ కాలేదు. ఉదాహరణకు అన్నగారు ఎన్టీఆర్, విలనీ పాత్రల్లో తనదైన శైలిని చూపించి రంగారావు.. సమ ఉజ్జీలే. కానీ, అన్నగారు హీరోగా రికార్డులు సృష్టించారు. రంగారావు విలనీగా, కారెక్టర్ పాత్రల్లోనూ ప్రేక్షకులను మెప్పించారు.
ఈ ఇద్దరు కలిసి నటించిన అనేక సినిమాలు హిట్టే కానీ.. ఫట్ అన్నమాటే ఎరుగలేదు. కేవీ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన పాతాళ భౌరతితో రామారావుకు పెద్ద బ్రేక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో రంగారావు మాంత్రికుడి పాత్ర ధరించారు.సినిమా మొత్తానికి ఈ పాత్రే కీలకం. పైగా హీరోకంటే కూడా.. విలనీ పాత్రకు కేవీరెడ్డి ప్రాణం పోశారు. ఎక్కువ సేపు చూపించారు. రెమ్యునరేషన్‌కూడా ఎక్కువే ఇచ్చారు.
తీరా సినిమా విడదల సమయానికి.. నేను హీరో అంటే.. నేనే హీరో అంటూ.. రంగారావు, రామారావుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కేవీరెడ్డి, నిర్మాతలు.. విజయాసంస్థ వారు మౌనంగా ఉన్నారు. మొత్తానికి ఈ వాదన అటు ఇటు తిరిగి ఏకంగా ప్రేక్షకుల మధ్యకు చేరింది. దీంతో సినిమాను ఎగబడి చూశారు. వాస్తవానికి రంగారావు, రామారావు ఇద్దరూ కూడా.. ఎంతో కష్టపడే చేశారు. కానీ, ఈ వాదన ఎందుకొచ్చిందో ఇప్పటికీ తెలియదు.