News' స‌లార్ ' టార్గెట్ ఫిక్స్‌.. ప్ర‌భాస్ ముందు RRR, కేజీయ‌ఫ్‌,...

‘ స‌లార్ ‘ టార్గెట్ ఫిక్స్‌.. ప్ర‌భాస్ ముందు RRR, కేజీయ‌ఫ్‌, జ‌వాన్‌, ప‌ఠాన్‌ను మించిన ల‌క్ష్యం..!

స‌లార్ సినిమాతో డైనోసార్‌లా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ర్జించేందుకు ప్ర‌భాస్ రెడీ అవుతున్నాడు. ప్ర‌భాస్ స‌లార్ టార్గెట్ ఎంత ఉంది ? ఫ‌స్ట్ డే ఎన్ని కోట్లు రాబ‌ట్టాల‌న్న టార్గెట్ అయితే దాదాపు ఫిక్స్ అయిపోయింది. ఈ యేడాదిలో చాలా పెద్ద సినిమాలు చాలా బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్టాయి. వాటిని మించి ఇప్పుడు స‌లార్ టార్గెట్ ఉండ‌బోతోంది. ఇక స‌లార్‌తో ప్ర‌భాస్ కూడా ఆ రికార్డులు అన్నీ క్రాస్ చేస్తాడ‌నే అంచ‌నాలు ట్రేడ్ వ‌ర్గాల్లో ఉన్నాయి.

ఓపెనింగ్స్ విష‌యానికి వ‌స్తే విజ‌య్ లియో సినిమా ఈ యేడాది ఓపెనింగ్స్‌తో దుమ్మ దులిపేసింది. మొద‌టి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 135 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక షారుక్ జ‌వాన్ సినిమాకు మొద‌టి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 129 కోట్ల‌ గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చాయి. యానిమ‌ల్ సినిమాకు కూడా ఫ‌స్ట్ డే రు. 116 కోట్ల గ్రాస్ వ‌చ్చింది. సో ఇప్పుడు ఈ సినిమాల‌ను మించిన అంచ‌నాలు ఉన్న స‌లార్ ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌లో ఈ సినిమాలు అన్నింటిని క్రాస్ చేయాల్సి ఉంది.

ఇక రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 240 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక ఓవ‌రాల్ వ‌సూళ్ల‌లో చూస్తే జ‌వాన్ చాలా సులువుగా రు. 1000 కోట్లు దాటేసి రు. 1148 కోట్లు రాబ‌ట్టింది. యానిమ‌ల్ కూడా రు. వెయ్యి కోట్ల క్ల‌బ్‌లో చేర‌బోతోంది. స‌లార్ ఈ రెండు సినిమాల‌ను కూడా అధిగ‌మించిల్సి ఉంటుంది. స‌లార్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

నైజాంలో మిడ్ నైట్ షోలు, టిక్కెట్ రేట్ల పెంపు ఇవ‌న్నీ స‌లార్ ఫ‌స్ట్ రికార్డుల‌తో పాటు సినిమాకు మంచి టాక్ వ‌స్తే లాంగ్ ర‌న్‌లో రు. 1000 కోట్లు దాటేసి మ‌రింత ఎక్కువ రాబ‌ట్ట‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. నార్త్ బెల్డ్‌లో షారుక్ న‌టించి డంకీ సినిమా నుంచి స‌లార్‌కు గ‌ట్టి పోటీ త‌ప్ప‌డం లేదు. విదేశాల్లో ఆక్వామ్యాన్ 2 నుంచి గ‌ట్టి పోటీ ఎదురవుతోంది. మ‌రి వీటిని త‌ట్టుకుని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌లార్ ఎలా గ‌ర్జిస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news