ప్రియమణి టాలీవుడ్ లో కొన్నేళ్లపాటు ఒక వెలుగు వెలిగింది. సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది. వాస్తవంగా ప్రియమణి టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎప్పుడు ఎంట్రీ ఇచ్చిందో చాలామందికి తెలియదు. 2002 సంక్రాంతి కానుకగా సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు తనయుడు హీరోగా పరిచయం అయ్యాడు. అలెగ్జాండర్ వల్లభ హీరోగా ఎవరే అతగాడు సినిమా వచ్చింది. ఈ సినిమాతోనే ప్రియమణి తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అయింది. అక్కడ నుంచి ఆమె పదేళ్లపాటు వెనక్కు తిరిగి చూసుకోలేదు.
అటు సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ తో పాటు ఇటు జూనియర్ ఎన్టీఆర్ లాంటి కుర్ర హీరోలతోనూ నటించింది. జగపతిబాబు లాంటి హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. ప్రియమణిలో కావలసిన అందంతో పాటు టాలెంట్ కూడా ఉండడంతో ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే రకరకాలుగా ఆమె వార్తల్లోకి ఎక్కింది. ప్రియమణి అద్భుతమైన నటనకు జాతీయ అవార్డ్ కూడా ఆమె సొంతం అయ్యింది.
ఎంతో లైఫ్ ఉంటుంది.. సౌందర్యలా కొన్నేళ్లపాటు తెలుగు సినిమాలు ఏలేస్తుంది.. అనుకుంటున్న టైంలోనే ప్రియమణి చేసిన చిన్న తప్పుతో ఆమె కెరీర్ కు అర్ధాంతరంగా ఫుల్‌స్టాప్ పడిపోయింది. ఎవరూ ఊహించిన విధంగా ఆమె అప్పటికి పెళ్లయిన ముస్తఫా రాజ్‌తో ప్రేమలో పడి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. అయితే ప్రియమణి భర్త ముస్తఫా తన మొదటి భార్యకు ఇంకా విడాకులు ఇవ్వలేదంటూ అతడి మొదటి పెళ్లి చుట్టూ రకరకాల వివాదాలు నడుస్తున్నాయి. తనకు విడాకులు ఇవ్వకుండానే ప్రియమణిని పెళ్లి చేసుకున్నాడని.. వారిద్దరి పెళ్లి చల్లదంటూ ఆమె ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. అలా ప్రియమణికి సవతిపోరు తప్పడం లేదు.
ప్రియమణి కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడంతో ఆమెకు ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఒకవేళ ప్రియమణి అలా కెరీర్ కంటిన్యూ చేసి ఉంటే సీనియర్ హీరోలకు టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత ఉన్న టైంలో మంచి ఆప్షన్ గా మరేదని చెప్పాలి. పెళ్లయ్యాక ఆమె కెరీర్ కంటిన్యూ చేస్తున్న కమర్షియల్ సినిమాలలో అవకాశాలు రావడం లేదు. ఆమె కొద్ది రోజులపాటు పెళ్లి వాయిదా వేసుకుని ఉంటే కచ్చితంగా మరో ఐదారేళ్ల పాటు ఆమెకు తిరుగులేకుండా ఉండేదని చెప్పాలి.