టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని తాజాగా నటించిన సినిమా హాయ్ నాన్న డిసెంబర్ 7న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఫుల్ టు ఫుల్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తరహాలో తెరకెక్కినట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు . ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుంది . శృతిహాసన్ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతుంది .
కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు నాని . ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని కు ..” హాయ్ నాన్న మూవీకి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు ..? అంటే ఇందులో లిప్ లాక్ సీన్స్ తీసేసారా..? లేక ఉండి యూ సర్టిఫికెట్ వచ్చిందా ..? అనే విషయం ఓపెన్ గా ప్రశ్నించారు హోస్ట్ . ఈ క్రమంలోనే నాని షాకింగ్ రిప్లై ఇచ్చాడు.
“అసలు లిప్ లాక్ లో తప్పేముంది..? నా ఏడేళ్ల కొడుకు ముందే నా భార్యను నేను కిస్ చేస్తాను.. ముద్దు పెట్టుకోవడం తప్పు కాదు కదా ..?ఇది కూడా ప్రేమని వ్యక్తపరచడమే.. దాన్ని ఎందుకు తప్పుగా చూస్తున్నారు . ముద్దంటే బూతుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు ..?”అంటూ ప్రశ్నించారు . నిజజీవితంలో చాలా లైట్ గా తీసుకునే ఈ ముద్దును సినిమాలోకి వచ్చేసరికి ఎందుకు పెద్ద భూతంలా చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు .. వేరే అమ్మాయికి ముద్దులు పెడితే తప్పు కానీ ఇష్టపడిన అమ్మాయిని కిస్ చేయడంలో తప్పేముంది .. ఈ పాత్రలో నేను ఇష్టపడిన అమ్మాయికి ముద్దులు పెట్టాను దానిలో తప్పేమీ లేదు..” అంటూ నాని సంచలన కామెంట్స్ చేశారు. ప్రెసెంట్ నాని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!