టైటిల్: హాయ్ నాన్న
నటీనటులు: నాని, మృణాల్ ఠాకూర్, ‘బేబీ’ కియారా ఖన్నా, జయరామ్, ప్రియదర్శి, అంగద్ బేడీ, విరాజ్ అశ్విన్ తదితరులతో పాటు అతిథి పాత్రల్లో శృతి హాసన్, నేహా శర్మ, రితికా నాయక్
మాటలు: నాగేంద్ర కాశీ
సినిమాటోగ్రఫీ : సాను జాన్ వర్గీస్
మ్యూజిక్ : హేషమ్ అబ్దుల్ వహాబ్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
కథ, దర్శకత్వం: శౌర్యువ్
రిలీజ్ డేట్ : డిసెంబర్ 6, 2023
సెన్సార్ రిపోర్ట్ : క్లీన్ యు
దసరా విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా హాయ్ నాన్న. దసరాతో నాని పాన్ ఇండియా రేంజ్ హిట్ కొట్టాడు. ఇప్పుడు హాయ్ నాన్నగా వస్తున్నాడు. ఈ సినిమాలో సీతారామమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా, బేబీ కీయారా ఖన్నా కీలకపాత్రలో నటించింది. ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లు మనసుకు హాయినిచ్చేలా ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈరోజు హాయ్ నాన్న సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో TL సమీక్షలో చూద్దాం.
కథ :
విరాజ్ (నాని) ముంబైలో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తూ ఉంటాడు. అతడి ఆరేళ్ల కుమార్తె పేరు మహి (బేబీ కియారా)కి కథలు చెప్పటం విరాజ్ కు అలవాటు. అమ్మ కథ చెప్పమని ప్రతిసారి అడుగుతూ ఉంటుంది. క్లాస్ ఫస్ట్ వస్తే చెబుతానని ప్రామిస్ చేస్తాడు విరాజ్. మహీ ఫస్ట్ వస్తుంది. కానీ అమ్మ కథ చెప్పడు. తెల్లారిన తర్వాత తండ్రికి చెప్పకుండా మహి బయటికి వెళ్ళిపోతుంది. ఆ చిన్నారిని ఓ ప్రమాదం నుంచి యష్ణ ( మృణాల్ ఠాకూర్ ) కాపాడుతుంది. ఇద్దరు కలిసి కాఫీ షాపులో కూర్చుంటారు. అక్కడికి విరాజ్ వస్తాడు. తనకు అమ్మ కథ చెప్పాలని కూతురు పట్టుబడుతుంది.
మరో దారి లేక కథ చెప్పటం మొదలు పెడతాడు విరాజ్. విరాజ్ ఫోటోగ్రాఫర్ కాకముందు అతడికి వర్ష ఆ పాత్రలో యష్ణను (మృణాల్ ఠాగూర్)ను మహి ఊహించుకుంటుంది. అది ప్రేమగా మారుతుంది. వర్ష బాగా డబ్బున్న అమ్మాయి, విరాజ్ మిడిల్ క్లాస్.. తల్లి చెబుతున్న వినకుండా విరాజ్ ఇంటికి వచ్చి అతడిని పెళ్లి చేసుకుంటుంది వర్ష. ఈ దంపతులకు అందమైన పాప పుడుతుంది. విరాజ్ కథ చెబుతుంటే అతడు ప్రేమించిన అమ్మాయి పాత్రలో తనను తాను ఊహించుకొని యష్ణ.. విరాజ్ ప్రేమలో పడుతుంది.
అసలు పాప జన్మించిన తర్వాత ఏమైంది..? విరాజ్, వర్ష ఎందుకు విడిపోయారు..? వర్ష ఎక్కడికి వెళ్ళింది..? ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి..? తల్లిదండ్రులు ఎవరు..? వారం రోజుల్లో అరవింద్ ( అంగద్‌బేడీ) తో పెళ్లి పెట్టుకొని విరాజ్‌తో ప్రేమలో పడ్డ యష్ణ అతడికి తన మనసులో మాట చెప్పిందా..? లేదా..? చివరకు ఏమైంది. అన్నదే ఈ సినిమా కథ.
విశ్లేషణ :
తండ్రి కుమార్తె అనుబంధం.. ఇద్దరి మధ్య ప్రేమ నేపథ్యంలో సినిమాలు రావడం.. తెలుగు తెరకు కొత్త కాదు. తల్లి లేని కుమార్తెను.. ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రిని చూసి మనసు ఇచ్చిన అమ్మాయిల కథలు కూడా కొత్త కాదు.. ఆల్రెడీ వచ్చిన కథల మధ్య హాయ్ నాన్న సినిమాను కొత్తగా నిలబెట్టిన అంశం ఏది అని చూస్తే తల్లి పాత్ర అని చెప్పాలి. ఈ సినిమాలో కథానాయకుడు కుమార్తె కంటే.. తల్లి పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకు ఇచ్చిన ట్విస్ట్.. ఆర్టిస్ట్ చుట్టూ నడిచే సీన్లు.. చాలా కొత్తగా ఉంటాయి. తన కంటే హీరోయిన్ పాత్రకు స్కోప్ ఉన్నా కూడా ఆ పాయింట్ నచ్చి నాని ఈ కథకు ఓకే చెప్పారేమో అనిపిస్తుంది.
చిన్నారి తన అమ్మగా హీరోయిన్‌ను ఊహించుకోవడం మనస్సులను టచ్ చేస్తుంది. అయితే ఆ ట్విస్ట్ వచ్చేవరకు నడిచే ప్రేమ కథ రెగ్యులర్ రొటీన్ అనిపిస్తుంది. ఒక దశలో సార్ వచ్చారు సినిమా ఛాయలు సైతం కనిపిస్తాయి. మధ్యలో పాటలు కాస్త రిలీఫ్ ఇస్తాయి. ఒక్కసారి అయ్యాక గుండె జల్లుమంటుంది. ట్విస్ట్ రివిల్ అయ్యాక ముగింపు వరకు దర్శకుడు కథను ఆసక్తిగానే నడిపాడు. ఈ సినిమాకు బలం ట్విస్ట్ కాదు.. ప్రేమ. హీరో, హీరోయిన్ల మానసిక సంఘర్షణ. మన మనసులో బాధను, ప్రేమను.. అన్ని సార్లు బయటకు చెప్పలేం. అలాగని లోపల దాచుకోలేం. అటువంటి పరిస్థితి తెరపై ఆవిష్కరించడానికి దర్శకుడు శౌర్యవ్ బాగా ట్రై చేశాడు.
మానసిక సంఘర్షణను మనసుకు హత్తుకునేలా దర్శకుడు ఆవిష్కరించాడు. ప్రేక్షకుల సైతం ఆ ప్రేమను ఫీల్ అయ్యేలా చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఒక్కసారి ట్విస్ట్ రివీల్ అయ్యాక హీరో కథ విని హీరోయిన్ ప్రేమలో పడింది అని తెలిసాక.. తర్వాత జరిగే సినిమాను ఊహించడం పెద్ద కష్టం కాదు. క్లైమాక్స్ కోసం వెయిట్ చేయడం తప్ప చేసేదేం ఉండదు. ఈ కథకు సన్నివేశాలకు హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. పాటల కంటే కూడా నేపథ్య సంగీతం మనసును హత్తుకుంది. ప్రతి సన్నివేశం ఓ అందమైన పెయింటింగ్ ఉన్నట్లు ఉంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్.. నిర్మాతలు పెట్టిన ఖర్చు చాలా బాగున్నాయి. నాని తెరమీద స్టైలిష్, హ్యాండ్సమ్ గా కనిపించాడు. ఇప్పటివరకు నాని చేసిన సినిమాల్లో హాయ్ నాన్న ది బెస్ట్ లుక్ అని చెప్పాలి. భావోద్వేగా భరిత సన్నివేశాలలో నాని జీవించేసాడు.
ఆయనను చూసి భార్య, కుమార్తె అంటే ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. తన న్యాచురల్ నటనతో మరోసారి న్యాచురల్ స్టార్ బిరుదు సార్ధకం చేసుకున్నాడు. వర్షగా ప్రేమ కథలో కంటే యష్నగా ప్రస్తుత కథలో మృణాల్ ఠాకూర్ లుక్ స్టైల్ చాలా బాగుంది. మృణాల్ సైతం కొన్ని సన్నివేశాల్లో ఏడిపిస్తారు. చిన్మయి డబ్బింగ్ కూడా అందుకు ఒక కారణం అని చెప్పాలి. ఆమె అంత సహజంగా డబ్బింగ్ చెప్పారు. బేబీ కియారా ఖన్నా నటన ముద్దొస్తుంది. అంత చిన్న వయసులో ఆమె ఎమోషనల్‌గా చేసిన నటన ఆమె ప్రతిభ మెచ్చుకోకుండా ఉండలేము.
జయరామ్ ఇమేజ్ వల్ల తండ్రి పాత్రకు హుందాతనం వచ్చింది. క్లైమాక్స్ సన్ని వేశాలకు బలం చేకూరింది. హీరో స్నేహితుడుగా.. ప్రియదర్శి మధ్యలో కాస్త నవ్వించాడు. హిందీ నటుడు అంగద్ బేడీకి ఇది తొలి తెలుగు సినిమా. ఆయన సెటిల్ పెర్ఫార్మ్ చేశాడు. బేబీ నటుడు విరాజ్ అశ్విన్ రెండు మూడు కీలక సన్నివేశాలలో కనిపించాడు. శృతిహాసన్ డ్యాన్స్, గ్రేస్ సూపర్ అని చెప్పాలి. రితిక నాయర్ కూడా ఓ పాటలో సందడి చేసింది. నేహాశర్మ ఓ సీన్లో అలా తళుక్కున మెరిసి వెళ్లారు.
ఫైనల్‌గా…
చివరగా చెప్పాలి అంటే హాయ్ నాన్న ఓ ఎమోషనల్ జర్నీ. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంది. ట్విస్ట్ తీసి చూస్తే ఇది రొటీన్ సినిమా కథ. అయితే ఈ కథను నమ్మి ప్రాణం పెట్టిన మృణాల్ ఠాకూర్, నానితో పాటు సంగీతం అందించిన అబ్దుల్ వహాబ్ కు రియల్లీ హాట్సాఫ్ చెప్పాలి. ఇలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఓసారి థియేటర్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తే సినిమా నచ్చుతుంది. అయితే సినిమా చాలా స్లోగా మూవ్ అవుతుంది. కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చే ఈ సినిమా టార్గెట్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది.
ఫైనల్ పంచ్ :
ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే హాయ్ నాన్న
హాయ్ నాన్న రేటింగ్ : 2.75 / 5