Newsఆ హీరోయిన్ తో నాని ఇక సినిమాలు చేయడా..? ఏమైంది..? ఎందుకు...

ఆ హీరోయిన్ తో నాని ఇక సినిమాలు చేయడా..? ఏమైంది..? ఎందుకు అంత మాట అనేశాడు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని తాజాగా నటించిన సినిమా హాయ్ నాన్న. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో శృతిహాసన్ కూడా ఓ కీలకపాత్రలో కనిపించింది . ఈ సినిమా డిసెంబర్ 7న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కాగా సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న నాని తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటున్నాడు.

అయితే రీసెంట్ గా నాని అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ అభిమాని మాట్లాడుతూ..” మీరు హీరోయిన్ కీర్తి సురేష్ తో ఎప్పుడు సినిమా చేస్తారు..? నేను లోకల్ , దసరా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మీ కాంబో మాకు బాగా నచ్చేసింది. మళ్లీ మీ ఇద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ..?”అంటూ ప్రశ్నిస్తారు .

దీనికి నాని కూడా చాలా సరదాగా సమాధానం చెప్తాడు . కీర్తి సురేష్ బిజీ బిజీగా ఉంది . ఆమె ఎప్పుడంటే అప్పుడే అంటూ ఆన్సర్ ఇస్తాడు. అయితే అభిమాని ఈ క్వశచన్ అడగడానికి కారణం కూడా ఉంది . నాని కీర్తి సురేష్ మధ్య ఏదో వార్ జరుగుతుందని దసరా మూమెంట్ టైం లో వీళ్ళిద్దరికీ క్లాషెస్ ఏర్పడ్డాయని అప్పటినుంచి వీళ్ళు దూరంగా ఉన్నారు అని ..మీరు మాట్లాడుకోవడం లేదు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది.

వాటికి చెక్ పెడుతూ కీర్తి సురేష్ హీరో నాని భార్య అంజన బర్త్ డే నాడు స్పెషల్ గా విష్ చేసింది . అక్కడితో ఈ వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది . తాజాగా అభిమాని అడిగిన ప్రశ్నకు నాని ఓపెన్గా సమాధానం చెప్పడం కూడా ఈ వార్తలు మొత్తం ఫేక్ అంటూ అర్థం అయిపోయింది . దీంతో త్వరలోనే నాని కీర్తి సురేష్ నుండి సినిమా వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news