Newsతెలంగాణలో కాంగ్రెస్ గెలవడం పై నాని షాకింగ్ కామెంట్.. మధ్యలో ఎన్టీఆర్...

తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం పై నాని షాకింగ్ కామెంట్.. మధ్యలో ఎన్టీఆర్ ఎందుకు బాసూ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని తాజాగా నటించిన సినిమా ” హాయ్ నాన్న “. డిసెంబర్ 7వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. కాగా సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న నాని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో కూడా చిట్ చాట్ చేస్తున్నాడు . ఈ క్రమంలోనే రీసెంట్గా నాని సోషల్ మీడియాలో ఆస్క్ నాని అనే సెషన్ ని కండక్ట్ చేశారు. ఈ క్రమంలోనే పలువురు నాని ఫాన్స్ ఆయన గురించి తెలుసుకోవాలి అనుకున్న వార్తలను ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని తెలుసుకున్నారు.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ “తెలంగాణలో ఓటు వేశారుగా ..? తెలంగాణ రిజల్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు..? మీ మాటల్లో చెప్పండి..?” అంటూ క్వశ్చన్ చేశాడు . ఈ క్రమంలోనే నాని మాట్లాడుతూ ..”పదేళ్లు బ్లాక్ బస్టర్ సినిమా చూసాం ..థియేటర్లో ఇప్పుడు సినిమా మారింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం ..” అంటూ రిప్లై ఇచ్చాడు .

అయితే ఈ కామెంట్ చూసిన తర్వాత అందరికీ నానికి తెలంగాణలో కాంగ్రెస్ రావడం పట్ల నిరాశ ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు నాని బీఆర్ఎస్ కు బిగ్ ఫ్యాన్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు . ఇక ఇదే సెషన్లో ఓ అభిమాని ఎన్టీఆర్ తో ఉన్న రేర్ పిక్ షేర్ చేయమని అడగ్గా ..నాని ఎన్టీఆర్ హగ్ చేసుకుని ఉన్న ఓ స్పెషల్ పిక్ ని షేర్ చేస్తారు .

ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ పిక్ వైరల్ అవుతుంది. అయితే కావాలనే కొందరు “మరి తారక్ తెలంగాణలో ఓటు వేశారు కదా ..? కాంగ్రెస్ రావడం పట్ల ఆయన అభిప్రాయం ఏంటి ..?”అంటూ మధ్యలో తారక్ ని ట్రోల్ చేస్తున్నారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఇన్వాల్వ్ అయి అవసరం లేని మ్యాటర్లో తారక్ ని ఎందుకురా ..? ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటూ ఫైర్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news