సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించిన చివరి సినిమా ఖుషి. రౌడీ హీరో విజయ్ దేవరకొండకు జోడీగా ఆమె నటించిన ఖుషి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరుగా ఆడింది. ఇంకా చెప్పాలంటే సమంత హీరోయిన్‌గా చేయడమే ఈ సినిమాకు మైనస్ అన్న ప్రచారం కూడా జరిగింది. హీరోయిన్‌గా సమంత పనైపోయిందని.. ఆమె చేస్తే గీస్తే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసుకోవాలే కాని… కమర్షియల్ హీరోయిన్‌గా ఆమెకు అంత సీన్ లేదన్నది ఖుషి సినిమాతో ఫ్రూవ్ అయ్యిందనే టాలీవుడ్ గుసగుసలాడుకుంది.
ఇక ఖుషితో పాటు సమంత సిటాడెల్ వెబ్‌సీరిస్‌లోనూ నటించింది. ఈ వెబ్‌సీరిస్‌లో హాట్‌గా కనిపిస్తూ బుల్లితెరపై నేషనల్ లెవల్లో పాపులర్ అయిపోదామని కలలు కంది. విచిత్రంగా అదే టైంలో సమంత మాజీ భర్త నాగచైతన్య కూడా ధూత వెబ్‌సీరిస్‌లో నటించాడు. మాజీ భార్య భర్తలు ఇద్దరూ ఒకేసారి వెబ్‌సీరిస్‌లతో పోటీపడడంతో సహజంగానే ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
కట్ చేస్తే ధూత వెబ్‌సీరిస్ రిలీజ్ సూపర్ టాక్‌తో దూసుకుపోతోంది. అదే టైంలో సిటాడెల్ వెబ్‌సీరిస్ ఇప్పటకీ స్ట్రీమింగ్‌కు రాలేదు. దీని షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తయ్యింది. అయినా కూడా దీనిని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అయితే సిటాడెల్ ఒరిజినల్ వెర్షన్ ఇంగ్లీష్ లో అంత గొప్ప రెస్పాన్స్ అయితే రాలేదు.
దీంతో ఇప్పుడు ఇండియన్ వెర్షన్ విషయంలో మేకర్స్ అంత ఆసక్తిగా లేరనే అంటున్నారు. ఏదేమైనా ఓటీటీ విషయంలో చైతు తన మాజీ భార్య సామ్‌కు సవాల్ విసరడంతో పాటు పై చేయి సాధించాడనే చెప్పాలి.