సినిమా పరిశ్రమలో మరి ముఖ్యంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోలు ఎంత ఏజ్ వచ్చినా వారి పక్కన చిన్న పిల్లలు హీరోయిన్లుగా నటిస్తూ ఉంటారు. దీనిపై చాలా విమర్శలు వస్తుంటాయి. ఇప్పుడు సీనియర్ హీరోలకు జోడిగా హీరోయిన్లు దొరకటం లేదు. బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోల పక్కన కాజల్, శ్రేయ, అనుష్క లాంటి ముదురు హీరోయిన్లు నటిస్తే బాగానే ఉంటుంది. ఒక్కోసారి కుర్ర హీరోయిన్లు.. సీనియర్ హీరోల పక్కన నటిస్తే మరి చిన్నపిల్లల ఉంటున్నారు.
ముదురు హీరోలు, ముసలి హీరోల పక్కన కుర్ర హీరోయిన్లను పెడితే అస్సలు మ్యాచ్ కావడం లేదు. కెమిస్ట్రీ కూడా సరిగా ఉండటం లేదు. చిరంజీవికి జోడిగా శృతిహాసన్ చేసినప్పుడు ఏమాత్రం సెట్ కాలేదు. అలాగే బాలయ్య పక్కన కూడా శృతిహాసన్ మరి చిన్నపిల్లలా ఉందన్న కామెంట్లు వినిపించాయి.
ఇక ఇప్పుడు అక్కినేని నాగార్జున విషయంలో మరి చిన్నపిల్లను హీరోయిన్గా పెట్టడంతో నెటిజన్లు ఆడుకుంటున్నారు. నాగర్జున తాజాగా నటిస్తున్న సినిమా నా సామిరంగా.. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.
బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు కథ, డైలాగులు అందించారు. మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా పోరింజు మరియమ్ జోస్‌కు రీమేక్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌ను నిర్మాతలు పరిచయం చేశారు. వరలక్ష్మి అనే పాత్రలో ఆశికా రంగనాథ్ నటిస్తుందని వీడియో ద్వారా తెలిపారు. అచ్చ తెలుగు ఆడపిల్లల ఆమె ముస్తాబు అయిన తీరు ఆకట్టుకుంది. ఇక ఆమె రెడీ అవుతుండగా పక్కనే ఉన్న గోడ పక్క నుంచి నాగార్జున ఆమెని చూస్తూ ఉండటం కనిపించింది. అయితే వీరిద్దరి జోడి చాలా ఎబెట్టుగా ఉందని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
64 ఏళ్ళ నాగార్జున సరసన కేవలం 26 ఏళ్ల ఆశికా చిన్నపిల్లలా కనిపిస్తుందని.. ఇంకా చెప్పాలి అంటే నాగార్జునకు కూతురులా ఉందని కూడా కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఏకంగా 38 సంవత్సరాలు ఉంది. తనకంటే వయసులో 38 సంవత్సరాలు చిన్నదైనా ఆశికాతో నాగార్జున ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఏమాత్రం బాగోలేదని.. నాగార్జునకు సరైన జోడిని ఎంపిక చేసి ఉంటే బాగుండేది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అనుష్క, శ్రేయ, కాజల్ లాంటి ముదురు ముద్దు గుమ్మలను పెడితే బాగుండేదని అంటున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో అయినా నాగార్జున హిట్ కొడతాడేమో చూడాలి.