నందమూరి నటసింహం బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో తన కెరీర్‌లోనే హ్యాట్రిక్ హిట్ కొట్టారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బాలయ్యకు వరుసగా మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలు దక్కాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూడు బాక్సాఫీస్‌ను షేక్ చేసి పడేసాయి. టాలీవుడ్ లో నైజాం మార్కెట్ అంటే నందమూరి హీరోలకు కాస్త వీక్ అన్న టాక్.. ట్రేడ్ వర్గాల్లో ఉంది. బాలయ్యకు సీడెడ్‌తో పాటు కోస్తాలో మంచి మార్కెట్ ఉంటుంది. నైజాంలో హైదరాబాద్, ఖమ్మం మినహా మిగిలిన ప్రాంతాల్లో బాలయ్య సినిమాలకు అంతగా వసూళ్లు వచ్చేవి కావు. నైజాంలో మెగా హీరోలకు ముందు నుంచి ఎక్కువ మార్కెట్ ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తర్వాత బన్నీ నైజాం మార్కెట్లో దూసుకుపోతున్నాడు.
ఇక రామ్ చరణ్ కూడా నైజాం మార్కెట్లో కొంతవరకు పరవాలేదు. నైజాంలో మెగా హీరోల సినిమాలకు రూ.10 నుంచి 15 కోట్లు సులువుగా వస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో సినిమా హిట్ అయితే అక్కడ రూ.20 కోట్లు కూడా మంచినీళ్లు తాగినట్టుగా వసూళు వస్తున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి హీరోలలో ముందుగా నైజాం మార్కెట్ పై మంచి గ్రిప్ సాధించాడు. నాన్నకు ప్రేమతో సినిమా నుంచి నైజాంలో ఎన్టీఆర్ మార్కెట్ భారీగా పెరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలు రూ.15 నుంచి రూ.20 కోట్లకు పైగా వసూలు రాబట్టాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా నైజాంలో బాహుబలి రికార్డులు సైతం బీట్ చేసింది. బాలయ్య కూడా నైజాంలో దూసుకుపోతూ మెగా హీరోలు క్రియేట్ చేసిన రికార్డులు సైతం బీట్ చేస్తున్నాడు.
అఖండ, వీర సింహారెడ్డి రెండు సినిమాలు నైజాంలో రూ.20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఈ వసూళ్లు చూసి టాలీవుడ్ షేక్ అయింది. తైజాగా నైజాంలో భగవంత్ కేసరి సినిమాకు రూ.14.50 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే.. ఆ సినిమా టోటల్ రణంలో రూ.19 కోట్ల మార్క్ దాటేసింది. ఈ సినిమాకు ఇప్పటికే అక్కడ రూ.5 కోట్ల రేంజ్ లో లాభాలు సొంతం అయ్యాయి. ఏది ఏమైనా నైజాంలో వరుసగా మూడు రూ.20 కోట్ల సినిమాలు అంటే బాలయ్య లాంటి సీనియర్ హీరోకు అరుదైన ఘనతగా చెప్పాలి. ఇప్పటివరకు నైజాం అంటే మెగా హీరోలు, మెగా హీరోలు అంటే నైజాం అన్నట్టుగా ఉన్న మార్కెట్లోకి బాలయ్య ఒక్కసారిగా దూసుకు వచ్చాడు. నైజాం లోను బాలయ్య హవా మామూలుగా లేదు.