News"మహేశ్-రాజమౌళి అందుకే సినిమాను పొగిడేశారు"..యానిమల్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన తమ్మారెడ్డి...

“మహేశ్-రాజమౌళి అందుకే సినిమాను పొగిడేశారు”..యానిమల్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన తమ్మారెడ్డి ..!

తమ్మారెడ్డి భరద్వాజ..సీనియర్ దర్శకనిర్మాత. సినిమాల మీద ఆయన శైలిలో విశ్లేషణ ఇస్తుంటారు. ఎవరేమనుకుంటారు అనేది ఆయనకి అనవసరం. ఇండస్ట్రీలో జరిగే ప్రతీ పరిణామాలను చూసి స్పందిస్తుంటారు. చిన్న సినిమాలు తీసే వాళ్ళన్ బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో ఆయన టీం అందరికీ ఎంతగా సపోర్ట్ చేశారో తెలిసిందే.

రంగ మార్తాండ సినిమా విషయంలో కూడా ఆయన స్వయంగా కృష్ణవంశీని ఇంటర్వ్యూ చేసి చాలా విషయాలను బయటికి లాగారు. నీలాంటి సీనియర్ దర్శకుడు సినిమా సినిమాకి ఇంత గ్యాప్ తీసుకోకూడదని సలహా ఇచ్చారు. ఇక తాజాగా వచ్చిన యానిమల్ సినిమాపై కూడా ఓ ఇంటర్వ్యూలో ఆయన పద్దతిలో మాట్లాడారు.

యానిమల్ సినిమాకి వచ్చిన హైప్ గురించి చెప్పిన తమ్మారెడ్డి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ హీరో దర్శౌడికీ తెలుగులో, హిందీలో గత చిత్రాలు భారీ సక్సెస్ సాధించి ఉన్నాయి. కబీర్ సింగ్ 300 కోట్లు కలెక్ట్ చేసి ఉంది కాబట్టే ఆ దర్శకుడి మీద నమ్మకంతో సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెట్టారు. అంతేగానీ, సినిమాలో అంత గొప్పగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదని ముక్కుసూటిగా చెప్పారు.

ఇక ఆడియో ఫంక్షన్ లో మహేశ్ బాబు ట్రైలర్ చూసి మెంటలెక్కింది అని అన్నారు కదా అంటే..గెస్ట్ గా వచ్చిన ఎవరైనా సినిమా గురించి పొగుడుతారు గానీ, బాగోలేదని అనలేరు కదా. మహేశ్ అయినా, రాజమౌళి అయినా యానిమల్ సినిమాకి ముఖ్య అథితులుగా వచ్చినప్పుడు హైప్ వచ్చేలా మాట్లాడతారు తప్ప అంతమందిలో సినిమా చూడొద్దు అని అనలేరు కదా అని చెప్పుకొచ్చాడు. ఇక ఫైనల్ గా తమ్మారెడ్డికి యానిమల్ అంతగా నచ్చలేదని అన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news