రవి బస్రూర్.. సమకాలీన సినీ సంగీతంతో పరిచయం ఉన్నవాళ్లకు ఈ పేరు కొత్తగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి. కేజీయఫ్ 1, 2 – తాజాగా సలార్ సినిమాల మ్యూజిక్ డైరెక్టర్‌గా రవి బ్రసూర్ పేరు మార్మోగుతోంది. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కోట్లు గడిస్తున్నాడు. పెద్ద హీరోలు అందరూ కూడా రవి బ్రసూర్‌నే తమ సినిమాలకు సంగీత దర్శకుడిగా తీసుకోవాలని ఆరాటపడుతున్నారు.
అయితే రవి జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి.. ఈ స్థాయికి వచ్చాడు. అతడి కష్టాలు చూస్తే మనకు కూడా కన్నీళ్లు ఆగవు. చివరకు సంగీతం మీద ఇష్టంతో కీ బోర్డు కొనేందుకు డబ్బులు లేక.. తన కిడ్నీ సైతం అమ్ముకునేందుకు సిద్ధపడ్డాడు. ట్రైన్ టిక్కెట్‌కు డబ్బులు లేక బాత్‌రూమ్లో దూరి బిక్కుబిక్కు మంటూ ప్రయాణం చేశాడు.
రవి బ్రసూర్ అసలు పేరు కిరణ్. కర్నాటకలోని బస్రూర్ గ్రామంలో పుట్టాడు. యక్షగానాలు పాడుకొనే వంశం వాళ్లది. దీనికి ఆదరణ తగ్గడంతో వాళ్ల కుటుంబం సంగీత బృందంగా మారి మ్యూజిక్ ఆల్బమ్‌లు రూపొందించేది. కుటుంబంలో గొడవలతో అందరూ విడిపోయారు. వీరి మ్యూజిక్ ట్రూప్ చెక్కలైంది. కిరణ్‌కు కమ్మరి పనిలో అనుభవం ఉండడంతో కొన్నాళ్లు చెక్కల పని చేశాడు.
అయితే మనసంతా మ్యూజిక్ మీదే ఉంది. కీబోర్డు అద్దెకు తెచ్చుకుని సాధన చేసేవాడు. ఓ పాతిక వేలు సంపాదించి కీ బోర్డు కొన్నాడు. ముంబై వెళ్లి పాటలు పాడే ప్రయత్నాలు చేశాడు. ఓ రోజు తన సంగీత పరికాలు బ్యాగులో వేసుకుని థానే లోని లోకల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ అప్పుడే టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన కమాండోలు అనుమానంతో కిరణ్ మ్యూజిక్ పరికరాలు ఉన్న బ్యాగును నేలకేసి కొట్టారు.
ఆ తర్వాత కిరణ్‌ను పట్టుకున్నా అతడు అమాయకుడు అని డిసైడ్ అయ్యి వదిలేశారు. అప్పటికే పోలీసుల దెబ్బకు స్పృహ కోల్పోయిన కిరణ్ అటు వైపు వచ్చిన ట్రైన్ ఎక్కేశాడు. జేబులో డబ్బులు లేవు. టీసీ వస్తాడని భయపడి బాత్‌రూమ్‌లో దాక్కున్నాడు. ఇంటికొస్తే అప్పుల బాధ, సంగీత పరికరాలు కొనాలంటే డబ్బులు లేవు. ఆ టైంలో రు. 35 వేలకు కిడ్నీ అమ్ముకుందాని ఫిక్స్ అయ్యాడు. ఆపరేషన్ అంటే భయంతో హాస్పటల్ నుంచి పారిపోయాడు.
ఆ టైంలో రవి అనే ఫ్రెండ్ రు. 35 వేలు ఇవ్వడంతో అక్కడ నుంచి తన మ్యూజిక్ జర్నీ స్టార్ట్ చేశాడు. అలా ఎఫ్ఎం రేడీయోలో జంగిల్స్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ప్రశాత్ నీల్ కంట్లో పడి ఉగ్రం సినిమాతో సంగీత దర్శకుడు అయ్యాడు. కేజీయఫ్ 1, 2 ఇప్పుడు సలార్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. తన తొలి సినిమా రెమ్యునరేషన్ తీసుకుని తనకు డబ్బులు ఇచ్చిన రవి దగ్గరకు వెళ్లాడు. కానీ రవి ఆ డబ్బులు తీసుకోలేదు. నీలాగే ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేయ్ చాలు అని సలహా ఇచ్చాడు. అతడి సాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియక తన కిరణ్ అనే పేరును రవి బ్రసూర్‌గా మార్చుకున్నాడు.