నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గత ఏడాది బింబిసార సినిమాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఈ మార్క్ వసూళ్ల రాబట్టిన తొలి సినిమాగా బింబిసార రికార్డుల్లోకి ఎక్కింది. ఈ ఏడాది ప్రారంభంలో అమీగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ నిరాశపరిచాడు. ఇక ఇప్పుడు డెవిల్ లాంటి పీరియాడికల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూశాక సినిమా మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ట్రేడ్ వర్గాల్లోనూ బిజినెస్ హాట్ కేకులా నడుస్తోంది.
డెవిల్ సీడెడ్ రైట్స్ రూ.3.33 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ విషయం తెలిసిన దిల్ రాజు రంగంలోకి దిగిపోయారు. ఆంధ్ర మొత్తం తీసుకోవాలని భేరాసారాలు మొదలుపెట్టారు. ఆయన స్వయంగా సినిమా చూశారు. దాదాపు రూ.7 కోట్ల నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ దగ్గర డీల్ ఓకే అయినట్టు తెలుస్తోంది. మరో రూ.2 కోట్లు రిటర్నబుల్ అడ్వాన్స్ కూడా ఇస్తున్నారట. డెవిల్ సినిమా థియేటర్ అమ్మకాలు సక్సెస్ఫుల్గా పూర్తయ్యాయి.
నైజాం ఏరియాను ఆషియన్ సినిమాస్‌కు అనుబంధ సంస్థగా ఉన్న గ్లోబల్ సినిమాస్ తీసుకుంది. డెవిల్ సినిమాకు బజ్ అయితే మామూలుగా లేదని చెప్పాలి. కానీ డెవిల్ కు ఒక్కటే కాస్త సమస్యగా మారింది.
సలార్ లాంటి భారీ డైనోసార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తున్న వారం రోజులకే.. డెవిల్ విడుదలవుతోంది. దీంతో సలార్‌కు సూపర్ హిట్ టాక్ వస్తే ఎన్ని ? థియేటర్లు ఖాళీ చేసి డెవిల్‌కు ఇస్తారు అన్నది చూడాలి.
పైగా డెవిల్ విడుదలవుతున్న రోజు మరో రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. యాంకర్ సుమ కుమారుడు రోషన్ నటించిన బబుల్ గమ్, గాయని సునీత కుమారుడు నటించిన సర్కారు నౌకరి.. ఈ రెండు కూడా అదే రోజు రిలీజ్ అవుతున్నాయి. మరి వీటి పోటీని తట్టుకుని డెవిల్ బాక్సాఫీస్ దగ్గర ఎలా పెర్ఫామ్ ? చేస్తుందో చూడాలి. ఏది ఏమైనా ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాపై ప్రామిసింగ్ ఎక్కువగా కనిపిస్తోంది.