అక్కినేని నాగ చైతన్య, సమంత ల గురించి అందరికీ పూర్తిగా తెలిసిందే. ఏ మాయ చేశావే సినిమాతో ప్రేమలో పడిన ఈ జంట ఆ తర్వాత కొన్నేళ్ళ పాటు ప్రేమ పెళ్ళి ఆ తర్వాత విడాకులు..సోషల్ మీడియాలో ట్రోల్స్ అంతా తెలిసిందే. అయితే, సమంత-నాగ చైతన్య పెళ్లి తర్వాత సినిమాలను చాలా పకడ్బంధీగా ఒప్పుకున్నారు.
ఓ బేబీ, మజిలీ, జాను సినిమాలు వచ్చాయి. వీటిలో మజిలీ మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత సమంత-నాగ చైతన్య ఇలాంటి కథల కోసమే దర్శకరచయిలకి చెప్పారు. అంతేకాదు, మజిలీ లాంటి కథ గన తీసుకొచ్చి చెప్తే అది గనక నచ్చితే ఇద్దరూ కలిసి 6 నుంచి 7 కోట్ల రెమ్యునరేషన్ తో సినిమా కమిటవ్వాలని ప్లాన్ చేసుకున్నారు.
అయితే, తమిళ్మలో త్రిష కృష్ణన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ 96 ని దిల్ రాజు ఇక్కడ తిరిగి రీమేక్ చేశాడు. ఈ సినిమా ఫేడవుట్ అయిపోయిందనుకున్న త్రిష కి మంచి కం బ్యాక్ మూవీగా నిలిచింది. దాంతో తెలుగు కొసం రీమేక్ రైట్స్ కొన్న దిల్ రాజు నాగ చైతన్య-సమంతల తో తీయాలనుకున్నారు. కానీ, చైతూకి కథ నచ్చలేదు.
అందుకే, దిల్ రాజు నిర్మాత అయినా ఒప్పుకోలేదు. కానీ, సమంత జానూ సినిమా చేయడానికి ఒకే చెప్పింది. నాగ చైతన్య ఎంత చెప్పినా వినలేదట. వారి మధ్య మనస్పర్థలు మొదలవడానికి ఈ సినిమా కూడా ఓ కారణం అని అప్పట్లో టాక్ వినిపించింది. చైతూ స్థానంలో శర్వానంద్ వచ్చి చేరాడు. మొత్తం అవుట్ పుట్ చూసుకున్న తర్వాత సమంత ఉన్న సినిమా అయినా దిల్ రాజు ప్రమోషన్స్ చేయకుండా గాలికొదిలేశాడు. ఫైనల్ గా నాగ చైతన్య జడ్జ్‌మెంట్ నిజమైంది.