మంచి ఫామ్‌లో క్రేజ్ ఉన్న హీరోయిన్లు కియారా అద్వాని, కత్రినా కైఫ్, అలియాభట్, అనుష్క శర్మ లాంటి హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కంటున్నారు. ఒకవైపు ఫ్యామిలీలో ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో దూసుకుపోతున్నారు. ఇక టాలీవుడ్ లో ఎంతో ఫామ్ లో ఉన్న సంయుక్తా మీనన్ కూడా తన చిన్ననాటి స్నేహితుడుతో పెళ్ళికి రెడీ అవుతుంది.. ఇక సినిమా లేని హీరోయిన్ల సంగతి చెప్పేదేముంది ఎప్పుడో 15 సంవత్సరాల క్రితమే ఫేడౌట్ అయిన హీరోయిన్లు ఇప్పుడు పెళ్లిళ్లకు రెడీ అవుతున్నారు.
15, 20 ఏళ్ల క్రిందట తెలుగు, తమిళ భాషల్లో పాపులర్ హీరోయిన్ మీరా చోప్రా.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సరసన బంగారం సినిమా చేసిన తర్వాత మీరా క్రేజ్ మరింత పెరిగింది. వరుసగా తెలుగుతోపాటు తమిళ భాషల్లో సినిమాలు చేసింది. ఎంత తొందరగా పేరు తెచ్చుకుందో అంతే తొందరగా ఫేడ్ అవుట్ అయిపోయింది. సినిమాలు ఎంపికలో చేసిన తప్పులు.. ఆమె కెరీర్‌ను సైడ్ ట్రాక్ లోకి నెట్టేసాయి. అరకొరా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పటికే ముదురు ముద్దుగుమ్మ అయిపోయింది. ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతోంది.
కొన్నాళ్లుగా ముంబైకి చెందిన వ్యక్తితో సీక్రెట్ గా డేటింగ్ చేస్తుంది మీరా. అతడికి సినీరంగంతో ఎలాంటి సంబంధం లేదు. ముంబైలో వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. కొత్త ఏడాదిలో అతడిని పెళ్లాడబోతుంది మీరా. చాలామంది హీరోలు, హీరోయిన్‌లలా మీరా చోప్రా కూడా ముంబైలో కాకుండా రాజస్థాన్‌లోని ప్యాలెస్‌లో పెళ్లి చేసుకోబోతుంది. ఫిబ్రవరిలో పెళ్లి జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక చిన్న సినిమా ఉంది. ఈనెల 29న అది నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ప్రమోషన్లు పూర్తయిన వెంటనే మీరా పెళ్లి పనులు మొదలు పెడుతుందని తెలుస్తోంది.