టాలీవుడ్‌లోనే కాదు ఏ సినిమా రంగంలో అయినా హీరోయిన్లు, దర్శకుల మధ్య బంధాలు, అనుబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్లు ఛాన్సుల కోసం దర్శకులకు బాగా కోపరేట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా హీరోయిన్ ఓ స్టార్ దర్శకుడి చేతిలో పడితే ఆయన కోసం చేయాల్సింది అంతా చేస్తుంది.. ఆయన చెప్పినట్టు ఆడుతుంది… ఆయన చూపించమన్నది అంతా చూపిస్తుందన్న నానుడి ఇండస్ట్రీలో ఉందన్న సంగతి తెలిసిందే.
త్రివిక్రమ్ హ్యాండ్ పడడంతో ఇలియానా, సమంత, పూజా హెగ్డే ఎక్కడికో వెళ్లిపోయారు. త్రివిక్రమ్ ఫ్రీగా వాళ్లను లేపలేదు… వాళ్ల నుంచి ఆయన కావాల్సింది ఆయన తీసుకుంటాడనే ఇండస్ట్రీ జనాలు అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓ హాట్ హీరోయిన్‌కు టాలీవుడ్‌లో సరైన ఛాన్సులు లేవు. అయినా కూడా ఆమెను ఓ డైరెక్టర్ వాడాల్సినట్టుగా వాడుతూ ఆమెను హీరోయిన్‌గా మంచి పొజిషన్‌లో నిలబెట్టేందుకు తన వంతుగా ట్రై చేస్తున్నాడనే అంటున్నారు.
ఆ హీరోయిన్, డైరెక్టర్ బంధంపై టాలీవుడ్‌లో రకరకాల ప్రచారాలు కూడా ఉన్నాయి. వారిద్దరు ఎవరో కాదు అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్. RX 100, మహాసముద్రం చిత్రాల తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం మంగళవారం. ఈ సినిమాలో పాయల్ చేసిన నటన.. పాయల్‌ను చూపించిన తీరు చాలా కొత్తగా అనిపించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఫేడవుట్ అయిపోయిందనుకున్న పాయల్ కెరీర్ కు మంచి ఊపు వచ్చింది.
తాజాగా పాయల్ బర్త్ డే సందర్భంగా అజయ్ తో పాటు మంగళవారం టీంకు ఆమెకు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ కూడా తెలిపింది. అజయ్ భూపతి అయితే విషింగ్ హ్యాపీ బర్త్ డే టు ఇందు అండ్ శైలు అంటూ ప్రత్యేకమైన ప్రేమను చాటుకున్నారు. ఏదేమైనా అజయ్ భూపతి పాయల్‌తో ఇంకా చూపించాల్సినవి అన్నీ చూపిస్తూ ఆమె కెరీర్‌ను జాగ్రత్తగా కాపాడతాడనే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.