Newsఎన్టీఆర్‌, బ‌న్నీ, మ‌హేష్‌లు వెంట ప‌డ్డ పూజాహెగ్డే ఇప్పుడు టాలీవుడ్‌కు ఇంత‌కు...

ఎన్టీఆర్‌, బ‌న్నీ, మ‌హేష్‌లు వెంట ప‌డ్డ పూజాహెగ్డే ఇప్పుడు టాలీవుడ్‌కు ఇంత‌కు దిగ‌జారిందా…?

పూజాహెగ్డే ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరోయిన్‌. స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు సైతం పూజ వెంట ప‌డేవారు. పూజ‌ను స్టార్ హీరోయిన్‌ను చేయ‌డంతో పాటు ఆమెకు కోట్లాది రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్లు తీసుకునే స్థాయికి వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత పూజాకు త‌ల పొగ‌రు ఎక్కేసింద‌నే అంటారు. రెమ్యున‌రేష‌న్ మ‌రింత‌గా డిమాండ్ చేయ‌డంతో పాటు కండీష‌న్లు పెట్ట‌డం, త‌న‌తో పాటు త‌న కుక్క‌కు కూడా ఫ్లైట్‌లో టిక్కెట్లు తీయాల‌న్న కండీష‌న్లు పెట్ట‌డం… షూటింగ్‌కు ఆల‌స్యంగా రావ‌డం లాంటి విష‌యాలు పూజా తీరును టాలీవుడ్‌లో ఆమె ప‌ట్ల వ్య‌తిరేక భావం పెంచేశాయి.

టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్‌లో ఉన్న‌ప్పుడే ఆమె బాలీవుడ్‌లో ఒక వెలుగు వెల‌గాల‌న్న కోరిక‌తో అక్క‌డ అడుగుపెట్టింది. బాలీవుడ్‌లో ఆమెకు కాలం క‌లిసి రాలేదు. స్టార్ హీరోల‌తో చేసిన సినిమాలు డిజాస్ట‌ర్ అయ్యాయి. ఆ త‌ర్వాత ఆమె తిరిగి టాలీవుడ్‌లో రాణించాల‌ని ఇక్కడ‌కు వ‌చ్చినా ఇక్క‌డ ర‌ష్మిక‌, శ్రీలీల పోటీతో పూజ‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు పూజ టాలీవుడ్‌లో త‌న‌కు ఎవ‌రైనా ఛాన్సులు ఇవ్వ‌రా అని చ‌కోర ప‌క్షిలా వెయిట్ చేస్తోంది.

చివ‌ర‌కు పూజాకు తెలుగులో టైర్ 2 హీరోలే గ‌తి అయ్యేలా ఉన్నారు. తాజాగా ఆమె నాని స‌ర‌స‌న ఓ సినిమాలో ఎంపికైన‌ట్టు తెలుస్తోంది. శివ కార్తికేయన్‌తో డాన్ సినిమా చేసిన‌ సిబి చక్రవర్తి దర్శకత్వంలో నాని కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. ఈ సినిమాలో పూజాహెగ్డేను హీరోయిన్గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలే పూజ వెంట‌ప‌డితే ఇప్పుడు టైర్ 2 సినిమాల్లో ఛాన్సులు వ‌చ్చినా చాలురా హ‌మ్మ‌య్యా అనుకునే స్థితికి పూజ దిగ‌జారింద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news