Newsటాలీవుడ్‌లో ఈ హీరోల‌తో సినిమాలంటే భ‌య‌ప‌డిపోతున్నారు... స‌ర్వం నాకించేస్తున్నారా...!

టాలీవుడ్‌లో ఈ హీరోల‌తో సినిమాలంటే భ‌య‌ప‌డిపోతున్నారు… స‌ర్వం నాకించేస్తున్నారా…!

టాలీవుడ్ లో కాంబినేషన్ చూస్తే చిన్న చిన్నగా ఉంటుంది. ఖర్చు చూస్తే తడిసి మోపిడి అవుతుంది. ఆదాయం చూస్తే ఏం ఉండటం లేదు. కాస్ట్ ఫెయిల్యూర్ అని బయటకు చెప్పుకోలేరు.. అది సాకుగా చూపి హీరోలు రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకునేందుకు అంగీకరించరు. డిజిటల్ రైట్స్, హిందీ హక్కుల హనీమూన్ ముగిసింది. మళ్లీ ఎప్పుడు ? ఇది మొదలవుతుందో తెలియదు. హీరోల రెమ్యూనరేషన్ లు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటు చూస్తే థియేటర్లకు జనాలు రావడం లేదు.

మంచి కథా బలం ఉన్న సినిమాలు కూడా చేయటం లేదు. ఈ లెక్కన కొట్లాది రూపాయలకు ఖర్చు చేస్తే సినిమా హిట్ అని పైకి చెప్పుకుంటున్న నిర్మాతలకు భారీ నష్టాలు తప్పడం లేదు. వరుస డిజాస్టర్ లలో ఉన్న సీనియర్ హీరోలు కూడా ఒక్కో సినిమాకు రు. 28 కోట్లు కావాలని అంటున్నారు. రవితేజ కనీసం నాలుగైదు సినిమాలకు ఒక హిట్టు కొట్టడం గగనం. ధమాకా హిట్ అయింది.. ధమాకాకు ముందు ధమాకా తర్వాత ప్లాపుల పరంపర కొనసాగుతోంది. ఒక్కో సినిమాకు రు. 28 కోట్లు తగ్గను అంటున్నాడు.

నాలుగైదు సంవత్సరాలకు ఒక్క హిట్టు వస్తే గొప్ప అన్నట్టుగా రవితేజ కెరీర్ ఉంటుంది. పైగా రెమ్యూనరేషన్ తగ్గించుకోమని అంటే అస్సలు ఒప్పుకోడు. ఇక గోపీచంద్ హిట్ కొట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో గుర్తులేదు. తాజాగా మైత్రి మూవీస్ – గోపీచంద్ సినిమాకు పేపర్ మీద బడ్జెట్ 115 కోట్లు అని లెక్క తేలిందట. సినిమా రిలీజ్ టైం కు ఇది 130 కోట్లు దాటేస్తుంది. ఆ హీరో మీద అంత వర్కౌట్ కాదని మధ్యలోనే సినిమాను వదిలేసారు. ఇక చిట్టూరి- శ్రీను నాని సినిమా అనుకున్నారు డాన్ సినిమా సిబి చక్రవర్తి దర్శకుడు. హీరో రెమ్యూనరేషన్ కాకుండానే 100 కోట్ల బడ్జెట్ చెప్పాడట. నిర్మాతల గుండె గుబెల్ మంది.

నానితో 125 కోట్ల ఖర్చుతో సినిమా అంటే ఎన్ని లెక్కలు వేసుకున్న గిట్టదు. దీంతో ఈ ప్రాజెక్టు కూడా మధ్యలో ఆపేశారు. ఇక రవితేజతో సినిమాలో తీయాలని అనుకున్నా చాలా మంది కూడా దండం పెట్టి వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవల రవితేజ సినిమాకు 85 కోట్ల బడ్జెట్ అంటేనే నిర్మాత దండం పెట్టేసాడు. మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌కు రు. 15 కోట్లు ఇచ్చి సినిమాలు తీస్తున్నా వ‌ర్క‌వుట్ కాని ప‌రిస్థితి.

ఇప్పుడు ఈ మిడిల్ రేంజ్ హీరోలు మాత్రమే కాదు.. మరికొందరు కొత్త హీరోలు కూడా సినిమాకు 10 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ చెబుతున్నారు. వీరితో సినిమాలు తీసింది కూడా నిర్మాతలు వెనకాడుతున్న పరిస్థితి. హీరోల రెమ్యున‌రేష‌న్ల‌లో మార్పు రాక‌పోతే నిర్మాత‌లు నిండా మున‌గ‌డం ప‌క్కా. అస‌లు మ‌రో రెండేళ్ల‌లో సినిమాలు తీసేందుకు నిర్మాత‌లు ముందుకు రారు. వ‌చ్చినా సినిమా స‌క్సెస్ అయినా లాభాలు ఉండ‌వు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news