మన సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా మలయాళం చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవుతున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లాంటి వారు ఈ లిస్ట్ లోకి వస్తారు. నిత్యా తెలుగులో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషలలో మంచి క్రేజ్ ఉంది.
నిత్యాకి కథ నచ్చాలి. లేదంటే హీరో ఎంత పెద్ద స్టార్ అయినా, దర్శకుడు ఎంత వాడైనా, నిర్మాణ సంస్థ ఎంత పెద్దదైనా ఒప్పుకునే సమస్యే లేదు. ఇక ఇటీవల టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు సంయుక్త మీనన్. ఈ బ్యూటీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ బాగా సపోర్ట్ చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలు ఆయన వల్లే వచ్చాయని చెప్పుకుంటున్నారు.
కానీ, మడోన్నా సెబాస్టియన్ కి మాత్రం అలాంటి సపోర్ట్ లేకనే అందం అభినయం ఉన్నా టాలీవుడ్ లో ఆమెని పట్టించుకోలేదట. మడోన్నా మంచి పర్ఫార్మర్. ప్రేమం సినిమాతో ఈ విషయం తేలిపోయింది. మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు భాషలలో హీరోయిన్గా నటించినప్పటికీ ఎందుకో ఎక్కడ స్టార్ హీరోయిన్గా సెటిలవలేకపోయింది. ఇండస్ట్రీలో మంచి పర్ఫార్మర్ అయినా కూడా ఎవరో ఒకరి సపోర్ట్ తప్పనిసరి.
అదే గురూజీ గనక ఓ చెయ్యేస్తే ఈపాటికి మడోన్నా బాగానే ఆస్తులు సంపాదించుకునేది. మడోన్నా మంచి సింగర్ అండ్ డాన్సర్. క్లాసికల్ అండ్ వెస్ట్రన్ లో దుమ్ము దులిపేస్తుంది. అంతేకాదు, మలయాళంలో పాపులర్ ఛానల్ అయిన కప్పా టీవీలో మడోన్నా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పర్ఫార్మ్ చేసింది. సినిమాల కంటే కూడా మడోనా ఈ రకంగా బాగా ఫేమస్ అయింది. కానీ, హీరోయిన్గా వచ్చే క్రేజ్ ఆ హోదా వేరే లెవల్. ఆ విషయంలో మడోన్నా సక్సెస్ కానట్టే. మితి మీరిన అందాల ఆరబోత చేయకపోవడం కూడా ఇంకో మైనస్ అనుకోవచ్చు.