ఏదైనా రంగంలో గెలుపు ఓటములు సహజం . అది ఆటలు కానివ్వండి బిజినెస్ కానివ్వండి .. సినిమా రంగం కానివ్వండి .. కొన్ని కొన్ని సార్లు హిట్ అవుతూ ఉంటుంది.. కొన్ని కొన్ని సార్లు ప్లాప్ అవుతూ ఉంటుంది . అయితే హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉంటారు కొంతమంది హీరోలు . ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంటాడు మన బన్నీ . ఈ విషయం.. నేను చెప్పింది కాదు ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా డైరెక్టర్ స్వయంగా ఆయన నోటితో ఆయనే చెప్పుకొచ్చారు.
ఆయన మరెవరో కాదు వక్కంతం వంశీ . ఆయన డైరెక్షన్ లో బన్నీ “నా పేరు సూర్య నా ఊరు ఇండియా” అనే సినిమా చేశాడు. ఈ సినిమా డిజాస్టర్ కా బాప్ ల నిలిచింది . ఈ సినిమా తర్వాత బన్నీ చాలా చాలా ట్రబుల్స్ ఫేస్ చేశాడు . హిట్ కొట్టడానికి చాలా కష్టపడ్డాడు. అయినా కానీ బన్నీ ఏనాడు కూడా వక్కంతం వంశీని డి గ్రేట్ చేస్తూ మాట్లాడలేదు . అంతేకాదు ఈ సినిమా కలెక్షన్స్ అటూఇటూ గా మారి టాక్ నెగటివ్గా వచ్చినా కూడా వక్కంతం వంశీకి కాల్ చేసి మరి అప్రిషియేట్ చేశారట.
“ప్రతి సినిమా జనాలకి నచ్చాలని లేదు .. కొన్ని కొన్ని మనకు కూడా బాగా నచ్చి లైఫ్ లో గుర్తుండిపోతాయి .. నా కెరియర్లో అలాంటి సినిమానే ఇది .. డోంట్ వర్రీ ఇంకా మంచి మంచి స్క్రిప్ట్స్ తో ముందుకు రా కలిసి చేస్తామంటూ సపోర్ట్ చేస్తారట. అదే మిగతా హీరోలైతే కొందరు ఫోన్ లిఫ్ట్ చేయరని .. ఒక సినిమా ఫ్లాప్ పడిన తర్వాత ఆ డైరెక్టర్ కి అవకాశం ఇవ్వరని ..కానీ బన్నీ చాలా బంగారం అని హిట్లు ఫ్లాపుల తో సంబంధం లేకుండా డైరెక్టర్ తో చాలా కూల్ గా మాట్లాడతారని వక్కంతం వంశీ చెప్పుకొచ్చారు”.