అక్కినేని నవమన్మధుడు అఖిల్ 2015లో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు. కెరీర్‌లో ఐదు సినిమాలు చేసిన నాలుగు సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్న అఖిల్ కెరీర్ పరంగా నిలదొక్కుకునేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. చెప్పుకునేందుకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు.
ఇక అఖిల్.. నాగార్జున.. రెండో భార్య ఒకప్పటి క్రేజీ హీరోయిన్ అమల దంపతుల కుమారుడు. అఖిల్ కు అమల అమ్మ అయితే.. టాలీవుడ్ కి చెందిన మరో సీనియర్ హీరోయిన్ కూడా అమ్మకాని అమ్మ అట. ఆమె ఎవరో కాదు ఆమని.. అఖిల్ చిన్నవయసులో ఉన్నప్పుడు సిసింద్రీ మూవీలో ఆమని తల్లిగా నటించింది. ఆ తర్వాత పెద్దయ్యక మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా అఖిల్ తల్లిగా చేసింది.
అలా ఒక హీరో చిన్నప్పుడు, పెద్దయ్యక తల్లిగా చేసిన ఘనత ఆమనికి దక్కుతుంది. అఖిల్ కూడా ఆమని ఎక్కడ కలిసిన మా అమ్మ అని ఎంతో ఆప్యాయతతో పిలుస్తాడట. ఇక అమల నాగార్జునకి జోడిగా కూడా కొన్ని సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో నటించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమని మంచి పాత్రలలో నటిస్తూ కొనసాగిస్తున్నారు.