Moviesనాగార్జున బుద్ధి మార‌క‌పోతే చైతు, అఖిల్ కూడా కెరీర్ ఉండ‌దా...!

నాగార్జున బుద్ధి మార‌క‌పోతే చైతు, అఖిల్ కూడా కెరీర్ ఉండ‌దా…!

ఎస్ ఇప్పుడు ఇదే విషయం టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతుంది. గత కొన్నాళ్లుగా నాగార్జున తీరు మారటం లేదు. టాలీవుడ్‌లో ఒకప్పుడు నలుగురు స్టార్ హీరోలు అంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున పేర్లు వినిపించేవి. ఈ నలుగురిలో బాలయ్య కెరీర్‌కు తగినట్టుగా కథలు ఎంచుకుంటూ వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. చిరంజీవి కూడా రీఎంట్రీలో ఎక్కువ డిజాస్టర్లు చూసినా ఒక‌టి, రెండు హిట్లు కొడుతున్నారు. వెంకటేష్ కూడా తన వయసుకు తగిన పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు.

నాగార్జున మాత్రం ఈ వయసులో అనాలోచిత నిర్ణయాలతో.. వరుస డిజాస్టర్లతో.. తన పరువు తానే తీసుకుంటున్నారు. నాగార్జున అనాలోచిత నిర్ణయాలతో పాటు అనేక కారణాలు నాగార్జున కెరీర్‌ను పత‌నావస్తకు తీసుకువెళ్లాయి. ఆఫీసర్, వైల్డ్ డాగ్, మన్మధుడు 2 ఇలా చెప్పుకుంటూ పోతే నాగార్జున సోలో హిట్ కొట్టి ఎన్నేళ్లు అవుతుందో ఎవరికీ గుర్తులేదు. అసలు నాగార్జున సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే అక్కినేని అభిమానులు కూడా చూడటానికి ఇష్టపడటం లేదు. నాగార్జునకు ఇంత క్రేజ్ రావడానికి కారణం ఆయన చేసిన సినిమాలు, తెలుగు సినీ అభిమానులు. కానీ ఇప్పుడు నాగార్జున వాళ్ళను మెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా లేదు.

బిగ్‌బాస్ షోలో, మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌లో.. అటు వ్యాపారాలో.. ఇలా నాగార్జునకు రకరకాలుగా సంపాదన ఉంది. ఇండస్ట్రీలో నాగార్జున గురించి తెలిసినవాళ్లు ఆయనది పక్కా బిజినెస్ మైండ్ అంటారు. నేను ఏం చేస్తున్నాను, నాకు ఎంత వస్తుంది.. అన్న లెక్కలే ఆయన ఎక్కువగా వేసుకుంటారని చెబుతూ ఉంటారు. ఇదే ఇప్పుడు నాగార్జున కెరీర్‌ను తిరోగమన స్థాయికి తీసుకువెళ్లింది. నాగార్జున ఇప్పటికే చాలా సంపాదించాడు. ఇంకా సంపాదించాల్సింది అంటూ ఏమీ లేదు.. ఆయనకు సినిమాలు చేయాలన్న ఆసక్తి ఉంటే మంచి కథలు, దర్శకులను ఎంపిక చేసుకోవడంతో పాటు.. తన వయసుకు తగిన పాత్రలు ఎంచుకుని సినిమాలు చేయడం మంచిది.

లేకపోతే సినిమాల‌ను ఆపేస్తే గౌరవం అయిన ఉంటుంది. కానీ తనకు రెమ్యూనరేషన్ వస్తుంది.. సినిమా హిట్ అయిన ప్లాప్ అయినా నాకు సంబంధం లేదు అన్నట్టుగా సినిమాలు చేస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ ప్రభావం ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల మీద కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సరైన‌ గైడెన్స్ లేక చైతు, అఖిల్ కెరీర్ కూడా ఏమాత్రం ముందుకు సాగటం లేదు. వీళ్ళిద్దరికి కూడా సరైన హిట్లు పడటం లేదు. ఇకనుంచి అయినా నాగార్జున తనతో పాటు తన ఇద్దరు కుమారుల సినిమా కెరీర్ పై సరిగా కాన్సన్ట్రేషన్ చేస్తే మరికొన్నిళ్ళ పాటు అక్కినేని తరం కొనసాగుతుంది. లేకపోతే ఈ తరంతోనే అక్కినేని పేరును తెలుగు ప్రేక్షకులు మర్చిపోయా ప్రమాదం కూడా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news