Movies"సలార్" సినిమాకి అనుష్క రివ్యూ చూశారా.. ప్రేమిస్తున్నాను అని ఇంతకన్న ఎలా...

“సలార్” సినిమాకి అనుష్క రివ్యూ చూశారా.. ప్రేమిస్తున్నాను అని ఇంతకన్న ఎలా చెప్పగలరు బాసూ..?

సలార్ ఇప్పుడు ఇది ఓ ప్రభంజనంలా మారిపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో టాలీవుడ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన సినిమా సలార్ . డిసెంబర్ 22న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ పాజిటివ్ హిట్ అందుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ లెక్కలను మార్చేసింది . ఏ సినిమా కలెక్ట్ చేయనటువంటి కలెక్షన్స్ కలెక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తుంది .

ఇప్పటికే త్రిపుల్ సెంచరీ దాటేసింది ..కచ్చితంగా త్వరలోనే వెయ్యికోట్లు క్రాస్ చేసేస్తుంది. కాగా ఇలాంటి క్రమంలోనే సలార్ సినిమాకి పలువురు స్టార్ సెలబ్రిటీ లు రివ్యూలు ఇస్తున్నారు . అయితే ప్రభాస్ జాన్ జిగిడి దోస్త్ అనుష్క మాత్రమే ఎటువంటి రివ్యూలు ఇవ్వకుండా డైరెక్ట్గా ప్రభాస్ ఇంటికే ప్రభాస్ కోసం ఒక అద్భుతమైన గిఫ్ట్ పంపించిందట .

ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్లో వైరల్ గా మారింది . ప్రభాస్ అనుష్కల మధ్య ఉండేది ఫ్రెండ్ షిపా..? ప్రేమా..? పక్కన పెడితే వీళ్లిద్దరి మధ్య మాత్రం మంచి రిలేషన్షిప్ ఉంది అని వాళ్ళ మాటలు వాళ్ళ బిహేవియర్ బట్టి అర్థమవుతుంది . సలార్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ప్రభాస్ సలార్ సినిమాకి సంబంధించిన ఒక పిక్చర్ ని తయారు చేయించి మరి.. అనుష్క ప్రభాస్ ఇంటికి గిఫ్ట్ పంపించిందట .

ఆ బొమ్మపై “ఈ పాత్రకు నువ్వు తప్పిస్తే మరి వేరే ఒకరిని ఊహించుకోలేం డార్లింగ్ ” అంటూ తనదైన స్టైల్ లో గిఫ్ట్ కార్డు కూడా పంపించిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఎంతమంది సలార్ సినిమాకి రివ్యూ ఇచ్చిన అనుష్క ఇచ్చిన రివ్యూ మాత్రం అద్దిరిపోయింది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news