మన బంగారం మేలిమిది అయితే పనోడిని అనే పని ఉండదు అన్నది సామెత. మనం మంచి కంటెంట్ ఇస్తే.. అభిమానులు నెత్తిన పెట్టుకొని మోస్తారు.. అసలు ఆ మాటకు వస్తే యావరేజ్ కంటెంట్ అందించినా తమ హీరో కోసం గట్టిగా పోరాటం చేసి యాంటీ ఫ్యాన్స్‌తో పోరాడుతూ ఉంటారు. అసలే వీక్ కంటెంట్ ఇస్తే అభిమానులు ఎలా డీలా ? పడిపోతారో చెప్పక్కర్లేదు. ఇప్పుడు గుంటూరు కారం సినిమా ప్రమోషన్ కంటెంట్ విషయంలో అదే జరుగుతోంది. అలవైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – సంగీత దర్శకుడు తమన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గుంటూరు కారం.
పైగా 13 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ లీల లాంటి క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి లాంటి గ్లామరస్ హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమాకు కావలసినంత హైప్ ఉంది. ఇప్పటికే ఫ్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో దుమ్ము రేపుతుంది. అలాంటిది ఈ సినిమా ప్రచార చిత్రాలు, టీజర్లు ఇప్పటివరకు బయటకు వచ్చిన పాటలు చూస్తే సగటు సినీ అభిమానులు సంగతి పక్కన పెడితే మహేష్ బాబు వీరాభిమానులకే దమ్ముగా నచ్చే పరిస్థితి లేదు.
అలవైకుంఠపురంలో సినిమా పాటలతో పోలిస్తే అందులో కనీసం 50% కూడా మాకు నచ్చటం లేదని.. మహేష్ అభిమానులే చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. తమన్ అల వైకుంఠపురంలో పాటల ట్యూన్‌లు కాపీ కొట్టేసాడని కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలు ఆ సినిమా యూనిట్‌లో కొందరికి నచ్చటం లేదు. వాళ్ళు సోషల్ మీడియాలో మా పాటలకు ఏం తక్కువయింది అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇది రచ్చ రచ్చగా మారింది. నిజంగా కంటెంట్ లో దమ్ముంటే అభిమానులు నెత్తిన పెట్టుకొని ఎలా హైలెట్ చేస్తారో చెప్పక్కర్లేదు.
కానీ వీక్ ట్యూన్లు, సాహిత్యం, వీక్ కంటెంట్ ఇచ్చి అది నచ్చలేదంటే వాళ్లపై కౌంటర్లు విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్.. అన్న ప్రశ్నలు కూడా ఈ సినిమా యూనిట్‌కు వెళుతున్నాయి. సర్కారు వారి పాట సినిమా మహేష్ బాబు అభిమానుల ఆకలి తీర్చలేదు.. ఖచ్చితంగా గుంటూరు కారం సినిమాతో రికార్డులు బ్రేక్ చేస్తామన్న ధీమాతో ఉన్నారు. కానీ ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఏది కూడా సినిమాపై అంచనాలతో పోలిస్తే.. ఆ రేంజ్ లో లేదని అంటున్నారు. ఈ కామెంట్లు సినిమా యూనిట్‌కు నచ్చటం లేదు. అందుకే ఎవరికి వారు మహేష్ అభిమానులపై విరుచుకు పడటం మొదలుపెట్టారు. ఇది అంతిమంగా సినిమాకు, వాళ్లకే నష్టం అన్నది వాళ్లు గ్రహించడం లేదు. ఒక హీరో సినిమాకు అభిమానులే ఎదురు తిరిగితే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు.