Newsఅన్న‌గారిలో ఉన్న ఈ ఎక్స్ట్రార్డినరీ టాలెంట్ గురించి మీకు తెలుసా..? ఏ...

అన్న‌గారిలో ఉన్న ఈ ఎక్స్ట్రార్డినరీ టాలెంట్ గురించి మీకు తెలుసా..? ఏ హీరో కి లేని స్పెషల్ క్వాలిటీ..!!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని 24 క‌ళ‌ల‌పైనా అన్న‌గారు ఎన్టీఆర్‌కు గ‌ట్టి ప‌ట్టుంది. ద‌ర్శ‌క‌త్వం నుంచి కాస్ట్యూమ్స్ వ‌ర‌కు.. ఆయ‌న‌కు దూర దృష్టి కూడా ఉంది. ఇది కొన్నికొన్ని చిత్రాల్లో అన్న‌గారి స‌క్సెస్ రేటును మ‌రింత పెంచింది. ఇలా.. జ‌గ‌దేకవీరును క‌థ సినిమాలో అన్న‌గారు ఎంపిక చేసిన పాట‌.. సూప‌ర్ హిట్ సాధించింది. విజయా సంస్థ నిర్మాణంలో వ‌చ్చిన అపురూప దృశ్య‌కావ్యం.. జగదేకవీరుని కథ. ఎన్టీఆర్‌కి రాకుమారుడిగా మరింత గ్లామర్‌ను పెంచిన చిత్రం.

పింగళి నాగేంద్ర‌రావు సంభాషణలు, పాటలు ఈ చిత్రంలో కొత్త పుంతలు తొక్కాయి. ‘జలకాలాటలలో..’, ‘ఓ చెలీ ఓహో సఖీ..’, ‘వరించి వచ్చిన మానవ వీరుడు..’, ‘అయినదేమో అయినదీ..’, ‘శివ శంకరీ..’, లాంటి పాటలు ఇందులోనివే! వీటన్నిటితో పాటు కరుణరస ప్రధానమైన మరోపాట కూడా ఇందులో ఉంది. అదే ‘రారా కనరారా.. కరుణ మాలినారా.. ప్రియతమలారా..!’ అనేది. అయితే.. ఈ పాట ఎంపిక అంత తేలిక‌గా కాలేదు.

దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలు తనను ప్రేమలో ముంచెత్తి, తమకు వీలు చిక్కగానే విడిచి వెళ్లిపోతున్న ఘట్టంలో వారిని ఉద్దేశిస్తూ, గుండెలు కరిగేలా హీరో పాడే పాట ఇది. పింగళి అద్భుతంగా ఈ పాటను రాశారు. దీనికి సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు అనేక రాగాల్లో రకరకాలుగా ట్యూన్లు కట్టారు. వాటిని విన్న నిర్మాత, దర్శకులకు అన్ని ట్యూన్లూ నచ్చాయి. ఏది ఎంచుకోవాలో తేల్చుకోలేక పోయారు. దీంతో కొన్ని రోజులు దీనిని పెండింగులో పెట్టారు.

చివరకు ఏమీ తోచ‌క‌.. హీరో ఎన్టీఆర్‌ని పిలిచి ‘‘వీటిలో మీకు ఏ ట్యూన్‌ నచ్చిందో చెప్పండి’’ అని అడిగారట. వాటిని శ్రద్ధగా విన్న ఎన్టీఆర్‌, ‘భాగేశ్వరి’ రాగంలో చేసిన ట్యూన్‌ని ఎంపిక చేశారట! సన్నివేశంలోనే ఫీల్‌ని చక్కగా ఎలివేట్‌ చేసిన ఆ ట్యూన్‌ ఎంతగానో హిట్‌ అయింది. తెర వెనుక ఘంటసాల గళం- తెర మీద ఎన్టీఆర్‌ నటన ఆ పాటను అమోఘంగా పండించాయి. ఆ సన్నివేశాన్ని చూస్తూ ప్రేక్షకులు మైమ‌రిచిపోయారు

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news