తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో సక్సెస్ కారనడానికి చాందిని చౌదరి మరో ఉదాహరణ. వైజాగ్ లో పుట్టిన చాందిని చదువు మాత్రం బెంగుళూరులో సాగింది. ఆ సమయంలోనే కొన్ని షార్ట్ ఫిలింస్ లో నటించింది. ముఖ్యంగా యమ్.ఆర్ ప్రొడక్షన్స్ లో చాందిని నటించిన షార్ట్ ఫిలిం ‘ది వీక్’ బాగా పేరు తెచ్చింది. అప్పట్లో షార్ట్ ఫిలింస్ లో నటించే వారికి బాగా ఆదరణ ఉండేది.
ఆ తర్వాత చాందిని ప్రేమ ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ట్రూ లవ్, అప్రోచ్, ప్రపోజల్, మధురం, సాంబార్ ఇడ్లీ, లక్కీ, టూ సైడ్ లవ్, ఫాల్ ఇన్ లవ్, రోమియో జూలియట్ లాంటి రొమాంటిక్ షార్ట్ ఫిలింస్ చేసి పాపులర్ అయింది. యంగ్ హీరో రాజ్ తరుణ్ ది కూడా వైజాగ్ కావడంతో వీరిద్దరు కలిసి చాలా షార్ట్ ఫిలింస్ తెచ్చి హిట్ పేయిర్ అనిపించుకున్నారు. 2013లో వచ్చిన మధురం అనే షార్ట్ ఫిలిం లో చాందిని పర్ఫార్మెన్స్ అందం చూసిన ముళ్ళపూడి వరా, కె.రాఘవేంద్రరావు కుందనపు బొమ్మ అనే మూవీలో అవకాశం ఇచ్చారు. అలాగే, కేటుగాడు సినిమాలోనూ నటించింది.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలలో చిన్న పాత్రలు చేసింది. బ్రహ్మోత్సవం, శమంతకమణి సినిమాలలో కూడా కనిపించింది. 2018లో వచ్చిన మను సినిమా, 2020లో సుహాస్ సరసన నటించిన కలర్ ఫోటో సినిమాలు బాగా పేరు తెచ్చాయి. కానీ, చాందినికి కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ దక్కలేదు. దీనికి కారణం పెద్ద స్టార్స్ ఎవరూ ఆమెకి అవకాశాలు ఇవ్వలేదు.
దర్శకులు కూడా చాందినీని అంతగా పట్టించుకోలేదు. కలర్ ఫొటో తర్వాత అమ్మడి ఫేట్ మారిపోతుందనుకున్నారు. కానీ, శ్రీలీల లాంటి యంగ్ బ్యూటీస్ కి ఇస్తున్న అవకాశాలలో 10వ వంతు కూడా చాందిని లాంటి టాలెంటెడ్ అమ్మాయిలకి ఇవ్వడం లేదు. తెలుగమ్మాయి అయినా బెంగుళూరు కల్చర్ కి బాగా అలవాటు పడింది. ఎక్స్‌ఫోజింగ్ లాంటి విషయంలో కాంప్రమైజ్ కాదు. అయినా ఇండస్ట్రీలో అలాంటి హీరోయిన్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ చాందిని బాగా బాధిస్తున్నాయట.