Moviesనాని హీరోయిన్ భ‌ర్త ఎవ‌రో తెలుసా... ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే...!

నాని హీరోయిన్ భ‌ర్త ఎవ‌రో తెలుసా… ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే…!

సినిమా హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరమైతే బయట పెద్దగా కనిపించరు. ఇండస్ట్రీకి దూరం జరిగి పెళ్లి చేసుకుని ఫ్యామిలీ జీవితంలోకి ఎంటర్ అయిన హీరోయిన్ల ఫోటోలు బయటకు వచ్చినా వాళ్లను సడన్గా గుర్తుపట్టలేము. వాళ్ళు చాలా మారిపోతారు. కొందరు బొద్దుగా, మరికొందరు లావుగా ఉంటారు. ఇప్పుడు అలానే ఓ బ్యూటీ కనిపించింది. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో మీరు గుర్తుపట్టారా ? ఆమె తెలుగులో నాని బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన హీరోయిన్.

పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు శరణ్యమోహన్. కేరళలోని అలేపిలో పుట్టిన ఈ కేరళ కుట్టి 8 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాల‌న‌టిగా చాలా సినిమాలు చేసింది. మలయాళం, తమిళ సినిమాలో నటించిన శరణ్య తర్వాత హీరోయిన్ అయిపోయింది. విలేజ్‌లో వినాయకుడు సినిమాలో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత నానికి జోడిగా భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది.

కళ్యాణ్ రామ్ కత్తి.. ఆ తర్వాత హ్యాపీ హ్యాపీగా సినిమాలలోను నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాల తర్వాత ఆమె మరే తెలుగు సినిమాలను నటించలేదు. అలా టాలీవుడ్‌కు దూరం అయిపోయింది. 1997 నుంచి 2014 వరకు కొన్ని సినిమాలలో నటించిన శరణ్యమోహన్ 2017లో తన చిన్నప్పటి ఫ్రెండ్ అరవింద్ కృష్ణన్‌ని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు.

ప్రస్తుతానికి శరణ్యకు సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదు. ఆమె స్వతహాగా భరతనాట్యం డ్యాన్సర్. తన డ్యాన్స్ వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే హీరోయిన్ గా ఉన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు ఫ్యామిలీ జీవితంలోకి వెళ్ళాక చాలా మారిపోయింది. అస్సలు శరణ్యను ఎవరు గుర్తుపట్టలేనట్టుగా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news