అదేంటో కానీ బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్ నేషనల్ హీరో అయిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే చాలు కేవలం తెలుగు సినిమా ప్రేక్షకులు.. సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది సినీ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమాలు అన్ని వరుసగా ప్లాప్ అవుతున్నాయి. సినిమాలపై భారీ అంచనాలు ఉండడంతో ఆ అంచనాలు అందుకోలేకపోతున్నాయి.
బాహుబలి 1, 2 తర్వాత ఎప్పుడు ప్రభాస్ సినిమా వచ్చినా బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు నార్త్ మీడియా అంతా ప్రభాస్ ని పనికట్టుకునే టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సాహో సినిమాను గట్టిగా టార్గెట్ చేసింది. అయినా సాహో ప్రభాస్ క్రేజ్‌తో ఒక్క బాలీవుడ్ లోనే ఏకంగా రు. 150కు పైగా కోట్లు కొల్లగొట్టింది. ఇక రాధేశ్యామ్‌ను ముందు నుంచి ఆడేసుకున్నారు. ఆ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. నార్త్‌లో కేవలం ఐదు కోట్ల మాత్రమే రాబట్టింది. ఆదిపురుష్ సినిమా కూడా అంచనాలు అందుకోలేదు.
ఆ సినిమాను కూడా బాలీవుడ్ మీడియాతో పాటు బాలీవుడ్ జనాలు గట్టిగా టార్గెట్ చేశారు. ఇక ఇప్పుడు సలార్ సినిమా వస్తోంది. సలార్ సినిమాపై కనివినీ ఎరుగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కేజిఎఫ్ సిరీస్ సినిమాలతో బాలీవుడ్‌కు సైతం సెగలు పుట్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం, ఇటు ప్రభాస్ హీరో కావడంతో సలార్ డైనోసార్‌లా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తుందన్న అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు సలార్‌ను కూడా తొక్కేసే కుట్ర బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు, బాలీవుడ్ మీడియా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
సలార్‌కు పోటీగా షారుక్ డంకీ సినిమా వస్తోంది. పైగా షారుక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండు సూపర్ హిట్లు కొట్టాడు. రాజ్ కుమార్ హిరాణీని అంత తక్కువ అంచనా వేసే వీల్లేదు. ఇప్పటికే బాలీవుడ్ పై దక్షిణాది ఆధిక్యం చూసి బాలీవుడ్ తట్టుకోలేక పోతోంది. అందుకే సలార్‌పై తమ ఆధిపత్యం చూపించడానికి అక్కడ చాపకింద నీరులా ప్రయత్నాలు మొదలైపోయాయి. ప్రీమియర్ షోలూ, ఎక్స్‌ట్రా షోలు, అర్ధరాత్రి షోలు అంటూ షారుక్ సినిమాకు ఇప్పటి నుంచే హంగామా స్టార్ట్ చేసేశారు.
21న డంకీ విడుదల అవుతోంది. 20 అర్థరాత్రి నుంచే ప్రీమియర్లు మొదలు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా 1000 ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. సలార్ కంటే ఎక్కువస్క్రీన్లు ఈ సినిమాకు దక్కేలా ట్రేడ్ చక్రం తిప్పుతోంది. ఓవర్సీస్‌లో అయితే 50 నగరాల్లో ప్రీమియర్లు పడనున్నాయి. నార్త్‌తో పాటు బాలీవుడ్ జనాల మొదటి ఆప్షన్ డంకీనే. ఆ తరవాతే సలార్.
ఇవన్నీ సినిమా రిజల్ట్ బయటకు రావడానికి ముందు చేసే టెక్నీక్‌లే. ఫైనల్‌గా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసి తొక్కాలనుకున్నా సలార్‌కు సూపర్ హిట్ టాక్ వస్తే ప్రభాస్ రాజు సినిమాను ఎవ్వరూ తొక్కలేరు. ఇప్పుడు ఈ సినిమాకు మంచి టాక్ రావడమే మనకు కావాల్సింది..!