మెగాస్టార్ చిరంజీవి 10 ఏళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి 2017 లో ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి వరుసపెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకు వెళుతున్నారు. గత ఏడాది ఆచార్య – గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిరు ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య… తాజాగా ఆగస్టులో భోళా శంకర్ సినిమాలో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుండటం చూస్తుంటే చిరంజీవిలో ఉన్న జోష్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.
అయితే రీఎంట్రీ ఇచ్చాక చిరంజీవి నటిస్తున్న సినిమాలు వరుసగా డిజాస్టర్లు అవుతున్నాయి. ఒక్క వాల్తేరు వీరయ్య సినిమా మాత్రమే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవికి సంబంధించి ఏ వార్త అయినా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉంటుంది. రెండు దశాబ్దాల క్రితం చిరంజీవికి జోడిగా ఒక సినిమాలో నటించిన స్టార్ హీరోయిన్ చిరంజీవి అభిమానులకు అప్పట్లో టార్గెట్ అయ్యారు.
ఆ హీరోయిన్ ఎక్కడ కనిపించినా ఆమెను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు చిరు అభిమానులు. ఇంతకు ఎవరా ? హీరోయిన్ చిరు అభిమానులు ఆమెను ఎందుకు టార్గెట్ చేశారో చూద్దాం. చిరంజీవి ద్విపాత్ర వినయంతో నటించిన సినిమా స్నేహంకోసం. శ్రీ సూర్య మూవీస్ నిర్మించిన ఈ సినిమాకు కేఎస్. రవికుమార్ దర్శకత్వం వహించారు. 1999 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో చిరంజీవిని హీరోయిన్ చంప దెబ్బ కొట్టే సన్నివేశం ఉంటుంది.. మీనా చిరంజీవిని చంప దెబ్బ కొడుతుంది.. అయితే వెండితెరపై తమ అభిమాన హీరోను చెంపదెబ్బ కొట్టడం మెగా అభిమానులకు నచ్చలేదు.. దీంతో వాళ్ళు సీరియస్ గా తీసుకొని మీనాను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
మీనా ఎక్కడ కనిపించిన ఆమెను బూతులు తిట్టడం మొదలుపెట్టారు. మీనాకు చిరంజీవిని చంప దెబ్బ కొట్టే అంత ధైర్యం ఎక్కడిది అంటూ ఆమెను టార్గెట్ చేశారు. చివరకు ఈ విషయం చిరంజీవి దగ్గరికి వెళ్ళింది. వెంటనే చిరంజీవి స్పందిస్తూ మీనా నన్ను నిజంగా కొట్టలేదు.. అది కేవలం సినిమా జస్ట్ ఆమె తన చేతిని అలా టచ్ చేసింది.. ఆ సన్నివేశంలో హీరోయిన్ నన్ను కొట్టకపోతే ఆ సన్నివేశానికి అర్థం ఉండదు.. అభిమానులు దీనిని సీరియస్గా తీసుకోవడం మానేయండి అంటూ ఆయన విజ్ఞప్తి చేసే వరకు వచ్చింది అలా అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ అయింది.