టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ సుమ యాక్టర్ రాజీవ్ కనకాల కొడుకు హీరోగా తెరంగేట్రం చేసిన సినిమా బబుల్ గమ్’. రోషన్ కనకాల హీరోగా నటించిన బబుల్ గమ్’ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది. కాగా కొత్త దర్శకుడు కొత్త హీరో కావడంతో ఈ సినిమాపై జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం హైప్స్ భారీ రేంజ్ లో పెరిగిపోయాయి .
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ జనరేషన్ కుర్రాళ్ళు లైక్ చేసే నాటు మాస్ డైలాగ్స్ తో పాటు హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ కి సంబంధించి సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు నెగిటివ్ కామెంట్లు అనడం కన్నా నాటి కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . సినిమాలో అసలు కథ కంటెంట్ ఏమీ ఉండదు . స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ముద్దులు హగ్గులు.. అరుచుకోవడాలు గిల్లుకోవడాలే ఉంటాయి .
పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఈ సినిమా నేటి జనరేషన్ కి నచ్చే సినిమా. అంతే కాదు ఒక డీజేటిల్లు ..ఒక అర్జున్ రెడ్డి.. ఒక బేబీ సినిమా లాగా ఈ స్టోరీ కూడా ముందుకెళ్తుంది. సినిమా స్టోరీ అయితే పాత చింతకాయ పచ్చడి గానే ఉంటుంది . అయితే రోషన్ కనకాల ఈ సినిమాలో నటించిన తీరు మాత్రం అభిమానులను ఆకట్టుకుంటుంది. మరి ముఖ్యంగా ఆయన చెప్పిన కొన్ని కొన్ని డైలాగ్స్ యువతకు పిచ్చెక్కించేస్తున్నాయి . అంతేకాదు ఈ సినిమాలో ఫస్ట్ సినిమాతోనే బోల్డ్ సీన్స్ బెడ్ సీన్స్ నటించడంతో రోషన్ కనకాలను వామ్మో అంటూ పొగిడేస్తున్నారు . ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జనరేషన్ కి బాగా నచ్చే అర్జున్ రెడ్డి లాంటి సినిమా నే ఇది. కలెక్షన్స్ పరంగా ఎలా ఉంటుందో చూద్దాం..?