Movies6వ రోజు ' స‌లార్ ' క‌లెక్ష‌న్ల‌లో బిగ్ డ్రాఫ్‌... ట్రేడ్...

6వ రోజు ‘ స‌లార్ ‘ క‌లెక్ష‌న్ల‌లో బిగ్ డ్రాఫ్‌… ట్రేడ్ గుండెల్లో గుబేల్‌.. గుబేల్‌…!

సర్రున లేచింది సలార్‌. ఈ సినిమాతో థియేటర్ కలెక్షన్ ట్రెండ్ ఒక్కసారిగా స్వింగ్ అయ్యింది. సలార్ సినిమా తొలి 5 రోజులు బాక్సాఫీస్‌ను ఊపేసింది. అసలు తొలి నాలుగు రోజులు కలెక్షన్ చూస్తే బాక్సాఫీస్ కళ్ళు తిరిగాయి. తెలుగు సినిమా స్టామినా.. ప్రభాస్ స్టామినా.. ఇది కదా అనిపించేలా కలెక్షన్లు వచ్చాయి. ఐదో రోజు కూడా పరవాలేదు అనిపించింది. ఆరో రోజు మాత్రం చాలా భారీగా డ్రాప్ అయిపోయింది. సలార్‌ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ఎక్కువ రేట్లకు అమ్మేశారు.

కలెక్షన్ల తీరు చూసి తొలి వారంలోనే అందరూ లాభాల్లోకి వచ్చేస్తారు అనుకున్నారు. సాధారణంగా పెద్ద హిట్ సినిమాలకు ఫస్ట్ వీకెండ్ లో సగం రికవరీ అవుతుంది. సలార్ విషయానికి వస్తే ఫస్ట్ వీకెండ్ లో సగం కన్నా ఎక్కువే తొలి 5 రోజులకు వచ్చేసింది. అయితే బుధవారం సడన్గా భారీగా డ్రాప్ కనిపించింది. తెలుగు నాట ఇంకా 25 నుంచి 35% రికవరీ సాధించాల్సి ఉంది. ఆరో రోజు కేవలం రూ.40 కోట్లు మాత్రమే వసూళ్లు వచ్చాయి.

నైజాంలో మరో రూ.15 కోట్లు రావాలి.. విశాఖ ఏరియాకు ఇంకా రూ.8 కోట్లు రావాలి.. నెల్లూరు లాంటి చిన్న ప్రాంతంలో మరో రూ.3 కోట్లు రావాలి.. మిగిలిన జిల్లాల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. అయితే వీకెండ్ శని, ఆదివారాలు కాస్త ఆశలు పెట్టుకోవచ్చు.. పైగా న్యూ ఇయర్ ఎండింగ్ టైం అందువల్ల మళ్లీ మంచి నెంబర్లు మరోసారి కనిపించే అవకాశం ఉంది. గురు, శుక్రవారాలు పెద్దగా కలెక్షన్లకు వస్తాయని ఆశించక్కర్లేదు.. ఇంకా పండగ సినిమాలు రావడానికి పది రోజులకు పైగా టైం ఉంది. ఇంతలోనే ఇలా డ్రాప్ అయినా తీరు మాత్రం ట్రేడ్ వర్గాలను బాగా టెన్షన్ పెట్టేస్తుందని చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news