నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా దసరాకు భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. బాలయ్యకు అఖండ, వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరి వరుసగా మూడో హిట్. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బాలయ్యకు వరుసగా మూడు సూపర్ హిట్ సినిమాలు దక్కాయి. భగవంత్ కేసరితో బాలయ్య ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏడు హ్యాట్రిక్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది మామూలు సెన్సేషనల్ కాదని చెప్పాలి.
ఒక్క సినిమాతో ఏడు హ్యాట్రిక్‌లు కొట్టడం అంటే ఆ ఘనత నిజంగా బాలయ్యకే దక్కిందని చెప్పాలి. సిటీలో వరుసగా రూ.15 కోట్ల షేర్ కొల్లగొట్టిన మూడు సినిమాలు ఉన్న హీరోగా బాలయ్య అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అలాగే సీడెడ్‌లోని నాలుగు ప్రధాన పట్టణాలలో వరుసగా కోటి రూపాయల గ్రాస్ కొల్లగొట్టిన హీరోగా హ్యాట్రిక్ కొట్టాడు. బాలయ్య నటించిన గత మూడు సినిమాలు ఈ నాలుగు ప్రధాన పట్టణాల్లో కోటికి పైగా గ్రాస్ వసుళ్ళు రాబట్టాయి.
అలాగే సింగిల్ క్యాలెండర్ ఇయర్ లో వరుసగా రూ.75 కోట్ల షేర్ కలిగిన రెండు సినిమాలు ఉన్న హీరోగా కూడా బాలయ్య అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇక సీనియర్ హీరోలలో వరుసగా రూ.140 కోట్ల గ్రాస్ ఉన్న తొలి హీరోగా హ్యాట్రిక్ కొట్టాడు. అలాగే వరుసగా మూడు సినిమాలతో రూ.75 కోట్ల షేర్ కొల్లగొట్టిన ఘనత సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బాలయ్య గత మూడు సినిమాలు కోటికి పైగా గ్రాస్ వసుళ్ళు చేశాయి. అది కూడా సింగిల్ థియేటర్లో కావటం విశేషం.
అలాగే అమెరికాలో గత మూడు సినిమాలు వన్ మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. నైజాంలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూడు సినిమాలు కూడా రూ.18 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. ఒకప్పుడు నైజాంలో బాలయ్య సినిమాకు రూ.7 – 8 కోట్ల షేర్ రావడం అంటేనే పెద్ద రికార్డ్. గౌతమీపుత్ర శాతకర్ణితో తొలిసారిగా రూ.10 కోట్ల షేర్ కొల్లగొట్టిన బాలయ్య ఇప్పుడు మంచినీళ్లు తాగినంత సులువుగా నైజాంలో రూ.18 నుంచి రూ.20 కోట్ల రేంజ్ షేర్ రాబడుతున్నాడు. ఇలా ఒక్క సినిమాతో బాలయ్య ఏకంగా ఏడు హ్యట్రిక్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు.