ఎల్ ఆర్ ఈశ్వరి. ఈమె తమిళనాడుకు చెందిన గాయని. ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, రెండు దశాబ్దాల పాటు.. అసలు ఈశ్వరి పాటలేని సినిమాలే లేవంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ, ఇది నిజం. నువ్వడిగింది.. ఏనాడైనా కాదన్నానా?` అనే పాట నుంచి లేలేలే నారాజా వరకు అనేక పాటలు.. అంతెందుకు.. ఆమె పాడిన పాటల్లా హిట్టయింది.తెలుగులోనే ఇలా హిట్లు ఉంటే.. ఇక, ఆమె 12 భాషల్లో పాటలు పాడారు. ప్రతిపాటా , ప్రతిభాషా హిట్ కొట్టాయి.అదే ఆమెకు పేరు తెచ్చిపెట్టింది. ఇటీవల నాటు నాటు పాట గురించి కూడా కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ తరహా లక్షణమే ఎల్. ఆర్. ఈశ్వరిని వివాదాల్లోకి నెట్టింది. ఆమె పాడడాన్నిఅందరూ ఆశ్వాదించారు. కానీ.. ఆమె లక్షణం మాత్రం ఎవరి పాటనూ ఆశ్వాదించలేకపోవడమే. ప్రతి పాటలోనూ వంకలు పెట్టేవారు. ఇది ఆమెకు .. ఇతర గాయకులకు మధ్య అగాధం పెంచింది. దీంతో యువళ గీతాల్లో ఆమెకు ఛాన్సులులేకుండా పోయాయని అంటారు. ఎవరూ ఆమెతో కలిసి పాడేందుకు ఇష్టపడే వారు కాదట. దీంతో ప్రత్యేక గీతాల్లోనే ఈశ్వరిని బుక్ చేసుకునేవారు. అయితే.. సినిమాకు ఒక్క పాట తప్ప.. ప్రత్యేక గీతాలను పెట్టే పరిస్థితి ఇప్పుడు.. అప్పుడు కూడా లేదు.
దీంతో ఈశ్వరి చాలా నష్టపోయారని అంటారు. అయితే.. ఈశ్వరి మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉండానే వారు. ఎప్పుడు ఎవరు వెళ్లి అడిగినా.. నెలతర్వాతే.. తన సమ్మతి తెలిపిన సందర్భాలు ఉన్నాయి. తమిళం, కన్నడం, తెలుగు సహా మలయాళంలో నూ అనేక వందల పాటలు పాటిన ఈశ్వరికి కేవలం కేరళలో మాత్రమే అనుకున్న గుర్తింపు లభించింది. అక్కడి ప్రభుత్వం ఆమెను సత్కరించింది. అయితే.. అప్పుడు కూడా ఆమె వివాదానికి కేంద్రం అయ్యారు.
కేరళలో తనను మించిన వారు లేరని వ్యాఖ్యానించారు. దీనిని కేరళ సినీ ఆర్టిస్టుల సంఘం ఖండించింది. దీంతో అక్కడ కూడా అవకాశాలు తగ్గిపోయాయి. ఇదీ.. సంగతి..! ఇదే విషయాన్ని బాలసుబ్రహ్మణ్యం అనేక సందర్భాల్లో చెప్పారు. గాయకులకు గళం ఉండాలి కానీ.. కంఠం ఉండకూడదు అని! అంటే.. వివాదాలకు దూరంగా ఉండాలని.. చెప్పేవారు.