Newsఇదేంది సామీ... యూఎస్‌లో ' స‌లార్ ' ఊచ‌కోత అప్పుడే... ఏంది...

ఇదేంది సామీ… యూఎస్‌లో ‘ స‌లార్ ‘ ఊచ‌కోత అప్పుడే… ఏంది అరాచ‌కం…!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ సినిమా స‌లార్‌. సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనివార్య కార‌ణాల‌తో క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 22న రిలీజ్ అవుతోంది. బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత ప్ర‌భాస్ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‌లో ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం.

ప్ర‌భాస్ నుంచి ఇప్పుడు సినిమా వ‌స్తోందంటే చాలు పాన్ ఇండియా రేంజ్‌లో.. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల‌కు కూడా రాని హైప్ వ‌చ్చింది. ఇక కేజీయ‌ఫ్ సీరిస్ సినిమాల‌తో ప్ర‌శాంత్ నీల్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయాడు. ఇప్పుడు ప్ర‌శాంత్ – ప్ర‌భాస్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న స‌లార్‌పై క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి.

రిలీజ్‌కు 15 రోజుల ముందే స‌లార్ ఓవ‌ర్సీస్‌లో వీరంగం ఆడేస్తోంది. స‌లార్ జస్ట్ అడ్వాన్స్ సేల్స్ లోనే నాలుగు లక్షల డాలర్లు మార్క్ క్రాస్ చేసి హాఫ్ మిలియన్ దిశగా దూసుకుపోతోంది. దీంతో స‌లార్ సినిమాపై ఉన్న హైప్ ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు కేజీయ‌ఫ్ ర‌వి బ్ర‌సూర్ మ్యూజిక్ అందిస్తుండ‌గా హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news