తెలుగు సినిమా పరిశ్రమలో సక్సెస్ రేటు చాలా తక్కువ. ప్రతి యేడాది విజయం కంటే అపజయాలే ఎక్కువగా ఉంటాయి కూడా. ఈ యేడాది కూడా కొన్ని ప్లాపులు ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టాయి. అసలు కొన్ని సినిమాలు అయితే ఘోరాతి ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. ఆ సినిమాల దెబ్బతో టాలీవుడ్ కుదేలైంది. ఈ సినిమా కొన్న బయ్యర్లు ఎగ్జిబిటర్లకు కంటిమీద కునుకు కూడా కరువు అయింది. మరి ఆ సినిమాలు చూద్దాం.
1- ఆదిపురుష్ :
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ముందుగా రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం బహించిన ఈ మూవీ డిజాస్టర్ అయింది. చివరకు ప్రభాస్ అభిమానులకు కూడా నచ్చలేదు. ఈ డిజాస్టర్ చాలదు అన్నట్టు వివాదాలు, కోర్టు కేసులు ఈ సినిమాకు అదనం. అయితే ఆదిపురుష్ డిజాస్టర్ బాధను సలార్ సినిమా తీర్చేసింది. సలార్ ఏడాది చివర్లో వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది.
2- భోళాశంకర్ :
ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా రెండవ స్థానంలో ఉంటుంది. ఈ సినిమా ఏ రేంజ్‌లో డిజాస్టర్ అయిందంటే.. మూవీ రిలీజ్ అయిన తర్వాత రెండో ఆటకే అంతా సైలెంట్ అయిపోయారు. తొలిరోజే జనాలు లేరు.. వారం తిరిగేసరికి చిరంజీవి కెరీర్లో అతి చెత్త సినిమాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా దెబ్బతో చిరంజీవి ఇమేజ్‌కు మచ్చ రావడంతో పాటు ఆయన మార్కెట్ కూడా దెబ్బతీసింది.
3- ఏజెంట్ :
ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ కూడా ఒకటి. అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా నిర్మాతతో పాటు అందరికీ కనీవినీ ఎరుగని రేంజ్‌లో భారీ నష్టాలు మిగిలాయి. మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని పరిమిత బడ్జెట్‌లో ఈ సినిమా తీసి ఉంటే సేఫ్ వెంచర్ అనిపించుకునేది. కానీ అఖిల్ మార్కెట్ ను మించి భారీగా ఖర్చు పెట్టడం.. సినిమా విడుదల ఆలస్యం కావడంతో.. ఏజెంట్ అతిపెద్ద రాడ్‌రంబోలాగా నిలిచి అందరిని ముంచేసింది. ఈ సినిమా కొన్నవాళ్లు జీవితాంతం సంపాదించినదంతా కోల్పోవలసి వచ్చింది.
4- శాకుంతలం :
ఇక సమంత లీడ్‌రోల్ పోషించి.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమాపై గుణశేఖర్‌తో పాటు మరో పెట్టుబడుదారు దిల్ రాజు భారీగా ఖర్చు పెట్టారు. థియేట్రికల్‌గా కనీసం 30% కూడా రికవరీ కాలేదు. ఉన్నంతలో నాన్ థియేటర్‌లో డబ్బులు మాత్రం మిగిలాయి. ఈ సినిమా డబ్బుతో పాటు సమంత పరువు కూడా పోయింది.
5- రావణాసుర :
ఇక రవితేజ నటించిన రావణాసుర సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. రవితేజకు ఇలాంటి డిజాస్టర్లు కొత్త కాదు. కానీ ధమాకా, వాల్తేరు వీరయ్య లాంటి రెండు బ్లాక్ బస్టర్ల తర్వాత ఈ స్థాయిలో డిజాస్టర్ పడటం రవితేజ మార్కెట్‌ను దెబ్బతీసింది. అలాగే రవితేజ నటించిన మరో సినిమా టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అయింది.