సినిమా ఇండస్ట్రీ అంటేనే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను తెరకెక్కించడం . కేవలం రొమాన్స్.. కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ ..కేవలం యాక్షన్ సీన్స్ .. కేవలం సెంటిమెంట్స్ ఇలా నమ్ముకుంటే కచ్చితంగా బొక్క బోర్ల పడాల్సిందే . అప్పుడప్పుడు జనాలను భయపెట్టాలి . భయపడితేనే ప్లాప్స్ నుంచి బయటపడి ఇండస్ట్రీలో నిడదొక్కుకోగలరు . అలా ఈ సంవత్సరం జనాలను భయపెట్టిన సినిమాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కోట్లు దాటేశాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!
విరూపాక్ష : సాయి ధరంతేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమా లాస్ట్ క్లైమాక్స్ సినిమాకి హైలైట్ గా మారింది . సంయుక్త మీనన్ విలనిజం సినిమాని మరో మెట్టెక్కించింది అని చెప్పాలి. ఈ సినిమాలో హీరో సాయి ధరంతేజ్ అయినా ఒరిజినల్ హీరో మాత్రం సంయుక్త అంటూ సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు ఓ రేంజ్ లో పొగిడేసారు. ఈ సినిమా దాదాపు 113 కోట్లు కలెక్ట్ చేసింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి ఈ సినిమాలో చేతబడి సీన్సే కారణమంటూ జనాలు కూడా చెప్పుకున్నారు.
మసూద : సంగీత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మొదటి నుంచి ఎండింగ్ వరకు ప్రతిక్షణం భయపడుతూ నెక్స్ట్ ఏం జరుగుతుంది ..? ఏం జరగబోతుంది ..? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది..? అంటూ ప్రజలను బాగా టెన్షన్ పెట్టింది. ఈ సినిమాలో పెద్దగా స్టార్స్ ఎవ్వరూ లేకపోయినప్పటికీ . ఈ సినిమా భారీగానే కలెక్ట్ చేసింది . ఈ మూవీ టోటల్గా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు దాటేసింది .
పొలిమేర 2: ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన పొలిమేర సినిమాకు సీక్వల్గా తెరకెక్కింది పొలిమేర2. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టేసింది . పెద్దగా క్యాస్ట్ అండ్ క్రూ లేకపోయినప్పటికీ కేవలం చేతబడి కాన్సెప్ట్ తోనే సినిమాకు భారీ కలెక్షన్స్ రాబట్టారు . ఈ సినిమా కూడా 100 కోట్లు దాటేసింది . కోట్లు బడ్జెట్ పెట్టి స్టార్ హీరోలు నటించిన సినిమాల కూడా ఈ సంవత్సరంలో బోల్తా పడ్డాయి . కానీ చేతబడి కాన్సెప్ట్ నమ్ముకున్న ఈ సినిమాలు మాత్రం 100 కోట్లు దాటేసి సక్సెస్ అయ్యాయి..!!