ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ ఎలాంటి సినిమాలను చూస్ చేసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఆడడం ఆడక పోవడం వాళ్లకి పెద్ద మ్యాటర్ కాదు. సినిమా ద్వారా క్రేజ్ సంపాదించుకుని నాలుగు రూపాయలు వెనకేసుకోవడమే వాళ్ళకి ఇంపార్టెంట్ . అందరు హీరోయిన్స్ ఇదే విధంగా ముందుకు వెళ్తున్నారు. కాగ రీసెంట్గా ఓ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే ముసలోడి సినిమా అంటూ చీప్ గా రిజెక్ట్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .
ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వి కపూర్ తెలుగులో కూడా డెబ్యూ ఇస్తుంది . దేవర సినిమాతో స్టార్ హీరోయిన్గా మారడానికి మార్గం ఏర్పరచుకునింది జాన్వి . అయితే జాన్వి లాంటి హీరోయిన్ మెగాస్టార్ లాంటి సినిమాలో నటిస్తే ఆమె కెరియర్ కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో శ్రీదేవి గారిపై ఉన్న అభిమానంతో వశిష్ట చిరంజీవి ఆమెకు తమ సినిమాలో అవకాశం ఇవ్వాలని చూశారు.
హీరోయిన్గా కాకుండా ఈ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ ఆమె ప్లే చేస్తే బాగుంటుంది అంటూ బోనీ కపూర్ ని అప్రోచ్ అయ్యారు. బోనీ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే జాన్వి మాత్రం ముసలోడితో సినిమా చేయమంటున్నావ్ ఏంటి డాడీ ..? అంటూ ఫైర్ అయిపోయింది . దీంతో ఆమె ఇక సినిమా చేయదు అని ఫిక్స్ అయిపోయిన బోని కూల్ గా ఈ ఆఫర్లు రిజెక్ట్ చేశారు . అంతే కాదు ఈ విషయం బయటకు రావడంతో జాన్వి ను బూతులు తిడుతున్నారు మెగా ఫాన్స్ . “నీకు ఆయన విలువ ఏం తెలుసు మీ అమ్మగారిని అడుగు మీ అమ్మగారి కెరీర్ ని మార్చేసింది ఆయనే” అంటూ సజెషన్స్ ఇస్తున్నారు..!!