Newsఎన్టీఆర్ ' దేవ‌ర ' సినిమా ఎందుకు త‌ప్ప‌కుండా చూడాలి.. టాప్...

ఎన్టీఆర్ ‘ దేవ‌ర ‘ సినిమా ఎందుకు త‌ప్ప‌కుండా చూడాలి.. టాప్ – 10 హైలెట్స్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో వస్తోంది. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా ఎన్టీఆర్‌కు నేషనల్ లెవెల్ లో తిరుగులేని క్రేజ్ తీసుకువస్తుందని ఎన్టీఆర్ అభిమానులతో పాటు టాలీవుడ్ సినీ అభిమానులు అందరూ ధీమాతో ఉన్నారు. ఏప్రిల్ 5, 2024న దేవర 1.. గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా తప్పకుండా ఎందుకు చూడాలి? టాప్ టెన్ హైలెట్స్ ఏంటో చూద్దాం.

1- దేవర మరో 150 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఆర్‌ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా. ఇది సోలోగా ఎన్టీఆర్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తొలి సినిమా దేవర.
2- గతంలో ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్, దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ – శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ జోడి కడుతున్న సినిమా కావడంతో ఈ జంటపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

3- జాన్వి కపూర్ తెలుగులో నటిస్తున్న తొలి సినిమా దేవర. ఆ మాటకు వస్తే సౌత్ ఇండియాలోనే ఆమె తొలి సినిమా దేవర కావటం విశేషం.
4- ఎన్టీఆర్ కెరీర్‌లో తొలిసారి రెండు పార్ట్‌లుగా వస్తున్న సినిమా దేవర. ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేస్తున్నట్టు దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు.
5- ఎన్టీఆర్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచంద్ర కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి సినిమా దేవర. ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో దేవర రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతోంది.

6- ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. సైఫ్అలిఖాన్‌ లాంటి స్టార్ హీరో తొలిసారిగా తెలుగులో నటిస్తున్న సినిమా దేవర. అందులోను సైఫ్లి ఆలీఖాన్‌ విలన్ పాత్ర కావడంతో కచ్చితంగా ఈ సినిమాకు బాలీవుడ్ లెవ‌ల్లో మంచి క్రేజ్ రానుంది.


7- గతంలో ఎన్టీఆర్ హీరోగా.. కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్‌లో జై లవకుశ సినిమా నిర్మించారు. ఇప్పుడు మళ్లీ మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి కళ్యాణ్ రామ్.. దేవర సినిమా నిర్మిస్తున్నారు.

8- ఈ సినిమాలో జాన్వీక‌పూర్ మ‌త్స‌కార కుటుంబంలో అమ్మాయి పాత్ర‌లో క‌నిపిస్తోంది. మొదటి తెలుగు సినిమాలోనే ఢీగ్లామర్ రోల్ చేస్తోన్న జాన్వీ ఇందులో తంగం (బంగారం) అనే పాత్రలో కనిపించనుంది.
9- దేవ‌ర రిలీజ్‌కు ఇంకా 150 రోజుల టైం ఉంది. 150 రోజుల్లో పెద్ద స్క్రీన్లలో అత్యంత భారీ ప్రదర్శనను చూసేందుకు సిద్ధంగా ఉండండి. Devara Frenzy కౌంట్ డౌన్ షూరు అంటూ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.
10- రు. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప‌లువురు హాలీవుడ్ టెక్నీషియ‌న్లు ఈ సినిమాకు ప‌ని చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news