Moviesమూడు సార్లు ఆఫర్ ఇచ్చిన ఆ స్టార్ హీరో సినిమాను రిజెక్ట్...

మూడు సార్లు ఆఫర్ ఇచ్చిన ఆ స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిన అనుష్క.. కారణం ఇదే..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో మిస్ అవుతూ ఉంటాయి. వన్స్ అవి మిస్ అయితే మళ్ళీ సెట్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టాల్సి ఉంటుంది.. మరి కొన్నిసార్లు అలాంటి రేర్ కాంబో దొరకనే దొరకదు . అలాంటి ఓ రేర్ కాంబోనే అనుష్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . వీళ్లిద్దరి కాంబోలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. నిజానికి వీళ్ళ కాంబోలో మూడు సినిమాలు రావాల్సి ఉంది.

మూడు సినిమాలు కూడా వచ్చినట్టే వచ్చి చేజారి పోయాయి . వాటికి కారణం కూడా అనుష్కనే. మొదటిగా వీళ్ళ కాంబోలో మగధీర సినిమా రావాల్సి ఉంది. అనుష్క ప్లేస్ లో కాజల్ ని తీసుకున్నాడు రాజమౌళి . అయితే ఈ సినిమాని అనుష్కనే రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత రచ్చ సినిమాలో కూడా అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నాడట డైరెక్టర్ సంపత్ .

అయితే ఆ టైంలో కథ నచ్చక అమ్మడు రిజెక్ట్ చేసిందట. ఫైనల్లీ ముచ్చట గా మూడోసారి గోవిందుడు అందరివాడేలే సినిమాలో అనుష్కను హీరోయిన్గా అనుకున్నారట . కానీ అప్పటికే ఆమె వేరే సినిమాల్లో బిజీగా ఉండడంతో ఈ పాత్రను రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఇలా మూడుసార్లు ఆఫర్లు వచ్చిన మూడుసార్లు అనుష్క ఆయనతో సినిమా చేయలేకపోయింది. వీళ్ళిద్దరి కాంబో సెట్ అవ్వలేకపోయింది . ఇకపై సెట్ అవుతుందని నమ్మకాలు కూడా లేవు అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news