టాలీవుడ్ లో విక్టరీ వెంకటేశ్ అంటే అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. ఇక హీరోయిన్స్ లో చాలామంది వెంకీ కి ఫ్యాన్ గా ఉన్నారు. ఖుష్బు వెంకీ అంటే చాలా ఇష్టపడుతుంది. చనిపోయిన దివ్య భారతికి వెంకటేశ్ ట్రీట్ మెంట్ చాలా ఇష్టం. అలాగే, అందాల తార శ్రీదేవికి వెంకటేశ్ ఆటిట్యూడ్ బాగా నచ్చుతుంది.
వీరే కాదు, వెంకటేశ్‌కి దగ్గరగా ఉండే టబు, మీనా, సౌందర్య కూడా చాలా ఇష్టపడతారు. నయన తారకి వెంకటేశ్ బిహేవియర్ ఆయన పాటించే స్పిరుచువల్ ఫార్ములాస్ బాగా ఇష్టం. హీరోయిన్స్ మాత్రమే కాదు, దర్శకులు..హీరోలలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, మహేశ్ బాబు దగ్గర నుంచి ఇప్పటి యంగ్ హీరోల వరకూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఇక అప్పట్లో సౌందర్య వెంకీతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించేది. వీరిది హిట్ పేయిర్. రాజా, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, జయం మనదేరా..ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అందుకే, వీరి కాంబోలో సినిమాలు తీయాలని మేకర్స్ కూడా చాలా పోటీ పడ్డారు. అయితే అంతకన్నా ముందే మీనా అంటే వెంకీకి బాగా సెంటిమెంట్ ఉండేదట.
ఇద్దరు కలిసి అబ్బాయిగారు, సుందరాకాండ, చంటి లాంటి సినిమాలు చేశారు. ఈ సినిమాలన్నీ బాగా వసూళ్ళు రాబట్టాయి. ముఖ్యంగా మీనా వెంకీ సరసన నటించడంతో పాటు తన అందమైన నాభిని బాగా చూపించేది. ఇక ఎద అందాల ఆరబోత బాగానే చేసింది. వీరిది హిట్ పేయిర్. కానీ, సౌందర్య వచ్చాక వెంకీ, మీనా కాంబోకి గండి పడింది.