టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని తాజాగా నటించిన సినిమా హాయ్ నాన్న. డిసెంబర్ 7వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . వైరా ఎంటర్టైన్మెంట్స్ చెరుకూరి వెంకట్ మోహన్.. డాక్టర్ విజయేంద్ర రెడ్డి తీగల.. మూర్తి కేఎస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు .సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతున్న సందర్భంగా హాయ్ నాన్న ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ .
ట్రైలర్ చాలా చక్కగా అద్భుతంగా ఫీల్ గుడ్ గా ముందుకెళ్ళిపోతుంది. ఒక తండ్రి కూతుర్ల బంధాన్ని చక్కగా చూపించాడు డైరెక్టర్ . అంతేకాదు నానిలోని మరో యాంగిల్ ని కూడా బయటపెట్టారు . అయితే ఈ ట్రైలర్ చూస్తుంటే ఎక్కడో ఈ సినిమా కథను ఇదివరకే చూసినట్లుందే అనే సందేహం రాక మానదు . చాలామంది ఈ సినిమా కథ నాగార్జున హిట్ సినిమా సంతోషం కు దగ్గరగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు .
సంతోషం సినిమాలో కూడా నాగార్జున ..గ్రేసి సింగ్ విడిపోతారు . అయితే అక్కడ ఆమె చనిపోతుంది. ఇక్కడ శృతిహాసన్ కొన్ని కారణాల చేత నానికు దూరమవుతుంది . ఒక బిడ్డ పుట్టాక తల్లిదండ్రుల విడిపోతే పిల్లలు బాధపడే బాధను చాలా క్లీయర్ గా కళ్ళకు కట్టినట్లు వివరించాడు డైరెక్టర్ . దీంతో ఈ సినిమా టోటల్ సంతోషం సినిమాకు కాపీ అని హాయ్ నాన్న అని కాకుండా సంతోషం 2 అంటే చాలా బాగుంటుంది అని కొందరు కావాలనే కౌంటర్స్ వేస్తున్నారు..!!