నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. తాజాగా నటిస్తున్న సినిమా యానిమల్ . స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా డిసెంబర్ ఒకటిన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు మూవీ టీం .
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2023/11/animal-movie-songs-ranbir-kapoor-1.webp)
కాగా ఇలాంటి క్రమంలోనే రష్మిక మందన్నా పాత్ర కోసం ముందు అనుకున్న హీరోయిన్ పేరు వైరల్ గా మారింది . నిజానికి సందీప్ రెడ్డి వంగాకు ఈ పాత్రలో రష్మిక మందన్నాను పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదట . ఈ పాత్ర కోసం పరిణితి చోప్రాను కథానాయికగా అనుకున్నారట . ముందే ఆమెను సంప్రదించారట .
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2023/11/The-content-was-EDITED-in-a-very-wrong-way-Sandeep-Reddy-Vanga-SPEAKS-UP-after-receiving-backlash-over-Kabir-Singh-success-interview.jpg)
అయితే అప్పటికే దర్శకుడు ఇంతియాజ్ తదుపరి ప్రాజెక్టులు ఆమె నటిస్తూ ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకుందట . ఈ విషయాన్ని స్వయాన ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో సందీప్ రెడ్డి వంగానే చెప్పుకు రావడం గమనార్హం..!!