తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళంత సినిమా నిర్మాణానికే పరిమితమయ్యారు. ఇక నిర్మాత కాబట్టి ఖచ్చితంగా హీరోతో, హీరోయిన్‌తో దర్శకుడితో ప్రత్యేకమైన బాండింగ్ ఉంటుంది. నిర్మాత చెప్పాడంటే చేసి తీరాల్సిందే. అయితే, కొందరు నిర్మాతలు హీరోయిన్స్ ని కొన్ని సందర్భాలలో ఇబ్బందులు పెడుతుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
అది స్టార్ ప్రొడ్యూసర్స్ విషయంలో లేదు గానీ, సినిమా తీస్తాము అని చెప్పి ఆఫీస్ ఓపెన్ చేసి కేవలం అమ్మాయిలతో సరదాలు తీర్చుకునే కొందరు మాత్రం ఐదో పదో అడ్వాన్స్ ఇచ్చి రాత్రిళ్ళు హోటల్ లో పనికానిచ్చేసి తెల్లవారితే మొహం చాటేస్తున్నారు. సురేశ్ బాబు, నాగార్జున, మంచు మోహన్ బాబు లాంటి వారు హీరోయిన్స్ ని చాలా గౌరవిస్తున్నారు.
ఆ తర్వాత జనరేషన్లో ఎక్కువ సినిమాలు తీస్తున్న దిల్ రాజు..ఆ తర్వాత నిర్మాణం రంగంలోకి వచ్చిన మైత్రీ మూవీస్, సితార ఎంటర్టైన్మెంట్స్ వారు, హారిక అండ్ హాసిని సంస్థ వారు స్టార్ హీరోయిన్స్‌తో పాటు యంగ్ బ్యూటీలకి అవకాశాలిస్తున్నారు. ఈ సంస్థలలో నటించిన కొత్త అమ్మాయిలు కూడా స్టార్ హీరోయిన్స్‌గా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, నిర్మాతలెవరికీ లేని ఆలోచన సూర్యదేవర నాగవంశీకి మాత్రం వచ్చింది. ఆయనకి యంగ్ హీరోయిన్‌తో కలిసి ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేయాలని ఉందట.
ఆ మధ్య పుసుక్కున ఓ మాట అని కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. డీసెంట్ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్లో పేరున్న నాగవంశీ..ఇలా హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయాలనుకోవడం మాత్రం అత్యాశే. దినర్థం ఆయనకి హీరోగా నటించాలని కోరిక. దర్శకుడు త్రివిక్రం ఎటూ చేతిలో ఉన్నారు. హీరోయిన్స్ డబ్బులిస్తే సై అంటారు. ఇక హీరో అవడం ఎంత విషయం అనుకున్నాడో ఏమో గానీ..ఆయన మనసులో మాట ఓ రకంగా బయటపెట్టాడట. నిజంగా అదే జరిగితే అడ్రస్ వెతుక్కోవాల్సి వస్తుందేమో.