కచ్చితంగా ఒక్కొక్కరి లైఫ్ లో ఒక్కొక్క స్పెషల్ పర్సన్ అంటూ ఉంటారు . మనకు ఏ కష్టం వచ్చినా బాధొచ్చినా.. సంతోషం వచ్చిన వాళ్ళతోనే చెప్పుకోవాలి అని ఆశపడుతూ ఉంటారు. అలాంటి మనుషులు ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ ఉంటారు . అయితే అనుష్క లైఫ్ లో మాత్రం అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ కి సంబంధించి ముగ్గురు హీరోలు ఆమె లైఫ్ లో స్పెషల్ రోల్ ప్లే చేశారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం ..!!
నాగార్జున: అసలు హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేని అనుష్కకు అలాంటి ఫీలింగ్ కలిగించి సూపర్ సినిమాలో అవకాశం ఇచ్చి ఆమెను సూపర్ స్టార్ హీరోయిన్గా మార్చేసాడు . అంతేకాదు అప్పట్లో అనుష్కకు నాగార్జునకు మధ్య అఫైర్స్ ఉన్నాయి అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి . అయినా వాటిని పట్టించుకోకుండా ఇద్దరు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. అంతేకాదు ఒకానొక ఇంటర్వ్యూలో అనుష్క ఆయనను దేవుడు అంటూ కూడా చెప్పుకొచ్చింది . లైఫ్ ఇచ్చిన దేవుడితో సమానమంటూ చెప్పుకొచ్చింది. అలా అనుష్క లైఫ్ లో కీలక పాత్ర పోషించాడు నాగార్జున .
గోపీచంద్ : అనుష్క గోపీచంద్ కాంబినేషన్లో ఎన్నో ఎన్నో సినిమాలు వచ్చాయి . ఈ సినిమాల్లో కొన్ని హిట్ అయ్యాయి .. కొన్ని ప్లాప్ అయ్యాయి . అయినా వీళ్ళు మధ్య ఫ్రెండ్షిప్ మాత్రం స్ట్రాంగ్ గా మారిపోయింది . ఎంతలా అంటే ఇండస్ట్రీలో ఏదైనా కష్టం వస్తే అనుష్క ఇప్పటికీ కూడా ముందుగా గోపీచంద్ కి కాల్ చేస్తుందట , అంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్. అందుకే అనుష్క.. గోపీచంద్ ని అస్సలు వదులుకోదు. ఇప్పటికీ వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నారు. అలా సినీ ఇండస్ట్రీలో గోపీచంద్ తో అనుష్కకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది .
ప్రభాస్ : ఈ పేరుతో అనుష్కకు ఎలాంటి సంబంధం ఉందో ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలి అని గత కొంతకాలంగా కోట్లాదిమంది జనాలు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళది ఫ్రెండ్షిప్ నా.. ప్రేమ.. దోమ పక్కన పెడితే వీళ్ళు పెళ్లి చేసుకోవాలి అని.. అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. ఆశ్చర్యమేంటంటే ప్రభాస్ అనుష్క కలవడానికి కారణం కూడా గోపీచంద్ నే. గోపీచంద్ – ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్స్. గోపీచంద్ తో అనుష్క సినిమాలో నటిస్తున్నప్పుడు ప్రభాస్ పరిచయమయ్యాడు . ఆ తర్వాత వీళ్ళిద్దరి జాన్ జిగిడి దోస్తులు అయిపోయారు. ఆ తర్వాత వీళ్ళ మధ్య చనువు చూసి వీళ్ళ మధ్య ప్రేమ ఉంది అంటూ కూడా జనాలు చెప్పుకొస్తున్నారు. రేపో మాపో పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా అందజేయబోతున్నారు అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు . ఇలా అనుష్క లైఫ్ లో ఈ ముగ్గురు కీలక రోల్స్ ప్లే చేశారు . అందుకే ఈ ముగ్గురు అనుష్క లైఫ్ లో వెరీ వెరీ స్పెషల్ అంటున్నారు జనాలు..!!