సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వచ్చినా.. కొన్ని కొన్ని సినిమాలకు బ్రేక్ అంటూ పడదు . ఆ సినిమాలు వచ్చి సంవత్సరాలు అవుతున్న దశాబ్ద కాలాలు దాటుతున్న ఇప్పటికీ టీవీలో కానీ ఆ సినిమాను చూస్తుంటే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది . అలాంటి సినిమాలలో ఒకటే బొమ్మరిల్లు . సిద్ధార్ధ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది .
మరీ ముఖ్యంగా యువతకు ఈ సినిమా తెగ నచ్చేసింది . యువతతో పాటు పెద్దవాళ్ళు కూడా ఈ సినిమాను బాగా లైక్ చేశారు . అంతమంది జనాలకు ఈ సినిమా నచ్చడానికి కారణం కథ. ప్రతి కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య ఉండే ఇబ్బందులను .. చాలా చక్కగా చిత్రీకరించాడు దర్శకుడు భాస్కర్. అయితే ఈ సినిమాను మొదటగా ఎన్టీఆర్ తో తెరలెక్కించాలనుకున్నాడట భాస్కర్.
ఆ విషయం దిల్ రాజుకు చెప్తే దిల్ రాజు స్వయాన ఎన్టీఆర్ కి పరిచయం చేశారట . ఎన్టీఆర్ కథ మొత్తం విన్నాక నాకు సినిమా నచ్చింది కానీ కొన్ని సీన్స్ మారిస్తే ఇంకా బాగుంటుంది అంటూ సజెస్ట్ చేశారట. తను రాసుకున్న కథలు మార్చడం ఇష్టం లేని భాస్కర్.. ఈ సినిమాను వేరే హీరోతో చేయాలి అని సిద్ధార్థ్ తీసుకున్నాడు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా మంచి బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్నాడు తారక్.