తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉంటారు. ఆయన ఒక విలక్షణ నేత. ప్రత్యేక తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష సైతం చేసి ప్రాణాలకు తెగించి మరి రాష్ట్రాన్ని సాధించుకున్న వ్యక్తిగా.. ఇటు తెలంగాణ ఏర్పడిన వెంటనే వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన రాజకీయ నేతగా రికార్డుల్లో ఉంటారు. ఇక రాజకీయాల్లో కేసీఆర్ ఎంత బిజీగా ఉన్నా.. ఆయన కూడా అప్పుడప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారు.
కేసీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అభిమాని అన్న విషయం తెలిసిందే. అందుకే తన కొడుక్కి కూడా ఆయన పేరు పెట్టుకున్నారు. కేసీఆర్‌కు జేమ్స్ బాండ్ సిరీస్ సినిమాలు అంటే ఎంతో ఇష్టం. అమితాబచ్చన్ షోలే, ఎన్టీఆర్ నటించిన ఆరాధన, దానవీరశూరకర్ణ సినిమాలను ఆయన ఎన్నోసార్లు చూశారు. దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులను కేసీఆర్ ఎప్పుడూ నెమరవేసుకుంటారు.
అలాగే సాగర సంగమం, స్వాతిముత్యం సినిమాలతో పాటు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ నటించిన పాత సినిమాలు అన్నింటిని ఇష్టంగా చూస్తూ ఉంటారు. ఎన్టీఆర్ గురించి కేసీఆర్ ఎన్నో సందర్భాల్లో ఎంతో గొప్పగా చెప్పారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పౌరాణిక సినిమాలు.. రాముడు, కృష్ణుడు పాత్రలు అంటే తనకు ఎంతో ఇష్టమని కేసీఆర్ చెప్పారు.
ఇక కేసీఆర్‌కు నాటుకోడి, టమాటా పప్పు, రోటి పచ్చడి, పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం. ఆయన మిగతా ఆహారం కూడా తీసుకుంటారు. తెలుపు, మెరూన్ రంగులు ఎక్కువగా ఇష్టపడతారు. కెసిఆర్‌కు బాగా ఇష్టమైన పుస్తకం వాల్గా నుంచి గంగా తీరం వరకు. ఏది ఏమైనా చిన్నప్పటి నుంచి పట్టుదల, మొండితనం, అనుకున్నది సాధించే వరకు విశ్రమించిన గుణం ఆయనను ఎప్పుడూ విజేతగా నిలబెడుతూ వచ్చాయి.