ఎలాంటి మనుష్యులకు అయినా అనారోగ్య సమస్యలు ఉండడం కామన్. సెలబ్రిటీలు అయ్యాక కూడా చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మన టాలీవుడ్‌కు చెందిన కొందరు సెలబ్రిటీలు కూడా రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు. వీరిలో కొందరు స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. ఈ లిస్టులో ఉన్న ఆ హీరోయిన్లు ఎవరెవరు.. ఏయే వ్యాధులతో బాధపడుతున్నారో చూద్దాం.
సమంత:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా సూపర్ పాపులర్ అయిన సమంత ఇటీవల కాలంలో తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు సమంత తరచూ అమెరికా కూడా వెళుతున్నారు. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ కోసమే సమంత సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేసింది.
ఇలియానా:
గోవా బ్యూటీ ఇలియానా రామ్ హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయ్యి తిరుగులేని సక్సెస్ తెచ్చుకుంది. సన్ననడుము సుందరి అయిన ఇలియానా బాడీ డిస్మోర్బిక్ డిజార్డర్‌తో బాధపడ్డారు. ఈ వ్యాధి వల్లే ఆమె భారీగా బరువు పెరిగిపోయింది. ఆమె ఫిజిక్ మొత్తం మారిపోయింది. బాగా లావెక్కిపోయింది.
స్నేహ ఉల్లాల్ :
అచ్చం ఐశ్వర్యరాయ్ పోలికలతో ఉన్న స్నేహ జూనియర్ ఐశ్వర్యారాయ్‌గా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యింది. కెరీర్ స్టార్టింగ్‌లో పలు సినిమాల్లో నటించిన స్నేహ ఆ తర్వాత ఆటో ఇమ్యున్ డిజార్డర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి ఉండడం వల్ల తరచూ స్పృహతప్పి పడిపోతూ ఉంటుంది. ఇలా షూటింగ్ లొకేషన్లలో తరచూ పడిపోతూ ఉండడంతో ఆమె చాలా ఇబ్బందులకు గురవుతోన్న పరిస్థితి.
హంసానందిని:
ఐటమ్ సాంగ్స్ ద్వారా సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది హంసానందిని. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ భారీన పడ్డారు. ఆ తర్వాత ఆమె ట్రీట్మెంట్ తీసుకుని మామూలు మనిషి అయ్యారు. అయితే హంసాకు జన్యుపరమైన క్యాన్సర్ కావడంతో విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకుంటోన్న పరిస్థితి.
నయనతార:
సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ నయనతార మేకప్ వేసుకుంటే తన మొహం మొత్తం రెడ్ రాషష్ వస్తాయట. ఈ వ్యాధి వల్లే ఆమె కొంత కాలం పాటు సినిమాలకు ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. తర్వాత ఈ వ్యాధికి చికిత్స తీసుకుని కోలుకుని తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.