మనిషిలా పోలిన మనుషులు ఏడు మంది ఉంటారు అని మన ఇంట్లోనే పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే అలా చాలామంది మనలా ఎవరు ఉన్నారు అని అనుకునే ఉండుంటారు. కాగ సినిమా ఇండస్ట్రీలో అలా ఒక హీరోయిన్ కి ఉన్న పోలికలు మరొక హీరోయిన్ కి ఉందటం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. ఇప్పుడు అలా దగ్గరగా ఉన్న పోలికలు ఉన్న హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం..!!
దివ్యభారతి – శ్రీదేవి: అతిలోకసుందరి దివంగత నటి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకుంది . అయితే ఈమె దివ్యభారతి పోలికలు దగ్గరగా ఉంటాయి అంటూ చాలామంది చెప్పుకొస్తూ ఉంటారు. వీరిద్దరూ ఒకేలా కనిపిస్తూ ఉండడంతో అభిమానులు కాస్త కన్ఫ్యూజ్ అయ్యేవారు అని కూడా సినిమా ఇండస్ట్రీలో టాక్ వినిపించేది .
స్నేహ ఉల్లాల్ – ఐశ్వర్యారాయ్ : మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ యంగ్ బ్యూటీ స్నేహ ఉల్లాల్ ఒకేలా ఉన్నారు అంటూ చాలామంది స్టార్ హీరోలు కూడా చెప్పుకొచ్చారు. కొన్ని ఫోటోలలో గుర్తుపట్టడం చాలా కష్టమని.. తెలియని వాళ్ళు చూస్తే వీరిద్దరూ అక్కాచెల్లెళ్ల అని అనుకుంటారని .. చాలామంది కామెంట్ చేశారు .
త్రిష – రేష్మసేన్ : సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో రాజ్యం ఏలేస్తుంది. బడా స్టార్స్ సరసన నటించిన గుర్తింపు సంపాదించుకుంది . అయితే త్రిష పోలికలతోనే యంగ్ హీరోయిన్ రేష్మ సేన్ కూడా ఉండేది అంటూ చాలామంది చెప్పుకొచ్చారు . ఈ రోజుల్లో సినిమాల్లో సైతం చాలా యాంగిల్స్ అలాగే కనిపించింది.
అసిన్-పూర్ణ : స్టార్ హీరోయిన్ అసిన్ కొన్ని యాంగిల్స్ లో చూస్తే అచ్చం మనకు పూర్ణాలనే ఉంటుంది అంటూ చాలామంది చెప్పుకొస్తారు. మరి ముఖ్యంగా కొన్ని ఔట్ఫిట్స్ లో వీళ్ళిద్దరూ ఒకేలా కనిపిస్తూ ఉంటారు . చూడడానికి మన కళ్లనీ మనమే నమ్మలేము.
దీపికా పదుకొనే – అమలాపాల్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న దీపికా పదుకొనే ఎంత కత్తిలాంటి ఫిగర్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కొన్ని కొన్ని సార్లు దీపికా పదుకొనేను అమలాపాల్ తలపిస్తూ ఉంటుంది . కొన్ని ఔట్ఫిట్స్ లో అమలాపాల్ అట్రాక్టివ్ పార్ట్స్ దీపిక పదుకొనేను గుర్తు చేస్తూ ఉంటాయి..!!