Newsఅప్పుడు ప్రీతి..ఇప్పుడు గీతాంజలి.. ఆ ఒక్కటి చెప్పే లిప్ కిస్ లకి...

అప్పుడు ప్రీతి..ఇప్పుడు గీతాంజలి.. ఆ ఒక్కటి చెప్పే లిప్ కిస్ లకి సందీప్ ఒప్పించాడా..?

సందీప్ రెడ్డి వంగ .. ఈ పేరు ఒకప్పుడు జనాలకు అస్సలు పరిచయం లేదు . ఈ పేరు చెప్తే ఎవరా ..? అంటూ సాగదీసే దానికి ఒక అరగంట సేపు టైం తీసుకునే వాళ్ళు . అయితే ఇప్పుడు ఈ పేరు చెప్తే వెంటనే విజిల్స్ అరుపులు వస్తూ ఉంటాయి. దానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా . ఈ సినిమా అసలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా మేకర్స్ కు ..మంచి లాభాలు తెచ్చిపెట్టింది . అంత ఎందుకు విజయ్ దేవరకొండ కెరియర్ తిరిగిపోవడానికి ఈ సినిమానే ప్రధాన కారణం అని చెప్పుకోవడంలో సందేహం లేదు .

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించిన షాలినీ పాండే ను చాలా కన్విన్స్ వేలో లిప్ కిస్ ఇవ్వడానికి మాట్లాడాడట సందీప్ రెడ్డివంగా . అంతేకాదు ఆయన రీసెంట్గా తెరకెక్కిస్తున్న అనిమల్ సినిమాలోను రష్మిక మందన్నాకు అదే మాట చెప్పి ఒప్పించారట . ఇద్దరికీ ఆయన ఒకే మాట చెప్పి ఒప్పించడం ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఆయన రష్మికకు షాలిని పాండేకు ఒక్కటే చెప్పుకొచ్చారట . “ఇది కేవలం సినిమానే .. మీరు ఈ పాత్రలో నటిస్తున్నారు ..అంతే . దీనికి మీరు ఏం మొహమాటం పడాల్సిన అవసరం లేదు . ఇబ్బంది పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒక నటిగా మీరు ఆ పాత్రలో లీనమైపోతున్నారు అంటూ వాళ్లను మెల్ట్ చేసేసి అలా లిప్ కిస్ సీన్స్ లో నటించడానికి ఓకే చేయించారట “. ఏ మాటకు ఆ మాట . ఈ సీన్స్ మిగతా డైరెక్టర్ లు తెరకెక్కించుకుంటే అస్సలు చూడబుద్ధి కాదు..సందీప్ రెడ్డి కాబట్టి చాలా ఎంటర్టైన్ గా .. ఇంకా ఇంకా చూడాలి అనిపించే విధంగా తెరకెక్కించాడు అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news